
పింక్ ఆటోలతో జీవనోపాధి
సాక్షి, చైన్నె: అబల సురక్షిత ప్రయాణానికి దోహదకరంగా ఉన్న పింక్ ఆటోల రూపంలో మహిళా డ్రైవర్లకు జీవనోపాధిని విస్తృతం చేస్తూ , సామాజిక మార్పు కోసం చర్యలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగా 100 మంది మహిళా ఆట్రో డ్రైవర్లకు పింక్ ఆటోలను శనివారం పంపిణీ చేశారు. చైన్నె నందబాక్కం ట్రేడ్ సెంటర్‌లో రోటరీజిల్లా 3234 గవర్నర్ ఏకేఎస్ రోటేరియన్ వినోద్ సరోగి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. 100 పింక్ ఆటోలను మహిళలకు అందజేశారు. వెనుకబడిన మహిళలకు ప్రత్యేకంగా జీవనోపాదినిమెరుగు పరచడమే కాకుండా, మహిళకు సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే విధంగా ఆత్మ విశ్వాసం పెంపు దిశగా ఈ ఆటోలను పంపిణి చేశారు. అనంతరం జరిగిన లీడ్ 25 – ఎయిమ్ హై రోటరీ ఇండియా లీడర్ షిప్ కాన్‌క్లేవ్ రోటరీ అంతర్జాతీయ అధ్యక్షుడు రోటేరియన్ ప్రాన్సిస్కో అరెజ్జో అధ్యక్షతన జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, విద్యా మంత్రి అన్బిల్ మహేశ్ పాల్గొని ప్రసంగిస్తూ, ఇది రాష్ట్ర ప్రాజెక్టుఅని, మహిళ పురోగతి, ఆర్థిక బలోపేతానికి దోహదకరంగా ఉంటుందని వివరించారు. విద్య, సామాజిక సహకారంలో రోటరీ సేవలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏకేఎస్ రోటేరియన్ ఆర్‌ఎం మురుగానందం, ఫ్‌లైట్ లెప్టినెంట్ కేపీ నాగేశ్, పింక్ ఆటో ప్రాజెక్టు చైర్మన్ శివ ఇలంగోవన్ తదితరులు పాల్గొన్నారు.

పింక్ ఆటోలతో జీవనోపాధి