
సైబర్ క్రైం కేసులో ఇద్దరి అరెస్టు
తిరువళ్లూరు: బ్యాంకు ఉద్యోగుల లంచం ముట్టచెప్పి భారీగా నగదు వున్న అకౌంట్‌లను పొంది వాటిని సైబర్ నేరగాళ్లకు అందించి కమిషన్‌లు పొందిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కొరట్టూరు ప్రాంతానికి చెందిన వరదరాజన్(60). ఇతని వాట్సాప్‌కు అన్‌లైన్ ట్రేడింగ్ పేరిట ప్రకటన వచ్చినట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే రెడింతలు లాభం వస్తుందని నమ్మించారు. దీంతో వరధరాజన్ 1.61 కోట్లు రూపాయలనుపెట్టుబడిగా పెట్టాడు. అయితే లాభం రాకపోగా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సైతం తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆవడి సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ మహాలక్ష్మి ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టి ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి వారి బ్యాంకు ఖాతాలను జప్తుచేశారు. అయితే నలుగురి వద్ద చేపట్టిన విచారణలో నాగపట్నం జిల్లాకు చెందిన డానియల్‌రాజ్‌కుమార్(34), కోయంబత్తూరు జిల్లాకు చెందిన నవీన్(39) తదితర ఇద్దరి వద్ద పలువురి బ్యాంకు అకౌంట్‌లను పొంది వారికి కమిషన్‌లు ఇచ్చినట్టు నిర్ధారించారు. పెద్దమొత్తంలో నగదు వున్న ఖాతాలను గుర్తించి వారికి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో లింక్‌లు పెట్టి నగదును కాజేసినట్టు నిర్దారించిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరిలించారు.

సైబర్ క్రైం కేసులో ఇద్దరి అరెస్టు