
● సావనీర్ ఆవిష్కరణ
ఇండియన్ ఎపిలెప్సీ సొసైటీ, ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ నేతృత్వంలో చైన్నెలో ఈసీఓఎన్–2025 ఆరోగ్య సదస్సు జరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ నిపుణులు అందరూ ఒకే వేదికపైకి వచ్చి న్యూరాలిజి, ఎపిలెప్టాలజి, న్యూరో, సంబంధిత అంశాలు, పరిశోధనలపై దృష్టి పెట్టారు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, సదస్సు చైర్మన్ డాక్టర్ వి.నటరాజన్, కార్యదర్శి పి.శరత్ చంద్ర ఆరోగ్య సంరక్షణతో పాటు, ఆధునిక విధానాల గురించి రూపకల్పన చేసిన వైద్య సంబంధిత పుస్తకాలు, సదస్సు ముఖ్యోద్దేశంతో కూడిన సావనీర్‌ను విడుదల చేశారు. – సాక్షి, చైన్నె