
శ్రీరంగం సందర్శనకు ముర్ము
సాక్షి, చైన్నె: సెప్టెంబర్ 3వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడుకు రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. తిరుచ్చి, తిరువారూర్‌లలో ఆమె పర్యటన జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత ఏడాది నవంబర్ చివరి వారంలో కోయంబత్తూరు, నీలగిరి జిల్లా ఊటీ పర్యటనకు వచ్చారు. మూడు రోజులు ఊటీలోనే ఉన్నారు. వెల్లింగ్టన్ ఆర్మీ శిక్షణ కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె తిరువారూర్‌లోటించాల్సి ఉంది. ఇక్కడ తమిళనాడు వర్సిటీ స్నాతకోత్సవానికి సైతం హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వర్షం కారణంగా ఆ పర్యటనను రద్దు చేశారు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరు 3న ఆమె తిరువారూర్ పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా సెంట్రల్ వర్సిటీ స్నాతకోత్సవంలో సైతం ఆమె పాల్గొననున్నట్లు ధ్రువీకరించారు. తిరుచ్చి, తిరువారూర్‌లలో రాష్ట్రపతి పర్యటన జరగనుంది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి తిరువారూర్‌కు తొలుత వెళతారు. అక్కడ పర్యటనను ముగించుకుని శ్రీరంగంకు వెళ్లనున్నారు. శ్రీరంగంలో రాష్ట్రపతి హెలికాప్టర్ కోసం హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక్కడ దర్శనానంనంతరం కారులో తిరుచ్చి విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. భద్రతా పర్యవేక్షణకు చర్యలు చేపట్టారు.