
తిరుత్తణిలో 13 సెం.మీ వర్షపాతం
తిరుత్తణి: తిరుత్తణిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పట్టణం జలమయంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అరక్కోణం రోడ్డులో వర్షపు నీరు పేరుకుపోయింది. దీంతో ఆ రోడ్డు వాహనాల రాకపోకలకు ఇబ్బంది వాటిల్లింది. అలాగే ఆర్కేపేటలో వినాయక విగ్రహాలు వుంచిన గదిలో వర్షపు నీరు చేరడంతో విగ్రహాలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల వరిపంట నీట మునిగి రైతులకు నష్టం కలిగింది. జిల్లాలో అత్యధికంగా తిరుత్తణిలో 13 సెం.మీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తిరువలంగాడులో 10 సెం,మీ. ఆర్కేపేటలో 8 సెం.మీ వర్షం నమోదైంది.