వీరరాఘవుని ఆలయ ముందుభాగంలో వర్షపు నీరు | - | Sakshi
Sakshi News home page

వీరరాఘవుని ఆలయ ముందుభాగంలో వర్షపు నీరు

Aug 24 2025 7:33 AM | Updated on Aug 24 2025 7:33 AM

వీరరాఘవుని ఆలయ ముందుభాగంలో వర్షపు నీరు

వీరరాఘవుని ఆలయ ముందుభాగంలో వర్షపు నీరు

తిరువళ్లూరు: ప్రసిద్ధి చెందిన వీరరాఘవుని ఆలయ ముందుభాగంలో భారీగా చేరిన వర్షపు నీటితో రాకపోకలు సాగించలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో 20పైగా దుకాణాలు, 30 నివాసాలు వుంటున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా ఆలయ ముందు భాగంలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో పాటూ మురుగు నీరు సైతం కలవడంతో దుర్వాసన వెదజల్లింది. ఈ నీటిలోనే భక్తులు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి వర్షపు నీటిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement