
థ్రిల్లర్ చిత్రంగా రూమ్‌బాయ్
తమిళసినిమా: ఏసీఎం సినిమాస్ పతాకంపై సూర్యకళ నిర్మిస్తున్న చిత్రం రూమ్‌బాయ్. ఈ చిత్రం ద్వారా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి జగన్‌రాయన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవ నటుడు సి.నిఖిల్ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. అరణ్మణై 4 చిత్రం ఫేమ్ హర్ష నాయకిగా నటిస్తున్న ఇందులో ఇమాన్ అన్నాచ్చి, బిర్లాబోస్, యూట్యూట్ ఫేమ్ కరుప్పు, సాధన, ఇన్‌స్టా ఫేమ్ కవిత విజయన్, కర్సగమ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి.భారతీరాజన్ (డీఎఫ్‌టీ) చాయాగ్రహణం, వేలన్ సహాదేవన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 50కి పైగా షార్ట్ ఫిలింస్ చేసిన దర్శకుడు జగన్‌రాయన్ తెరకెక్కించిన తాతా అనే షార్ట్ పిలిం తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తయ చాయాగ్రహణం అవార్డును గెలుచుకుందన్నది గమనార్హం. రూమ్‌బాయ్ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన ఇన్వెస్టిగేషన్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విజయ్‌సేతుపతి ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారని, దీనికి మంచి స్పందన వస్తోందని దర్శకుడు చెప్పారు.