
శ్రేయా అనిష్‌కు సత్కారం
కొరుక్కుపేట: వంటల పోటీల్లో బంగారు పతకం సాధించిన శ్రేయా అనిష్‌ను ఘనంగా సత్కరించారు. చైనీస్ వంటకాల చాంపియన్‌షిప్‌లో చైన్నెకు చెందిన చైన్నెస్ అమృత ఇనిస్టిట్యూట్ విద్యార్థిని శ్రేయ అనిష్ పంతకాల పంట పండించింది. ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. దీంతో ఈ విద్యార్థినిని ప్రశంసిస్తూ చైన్నెస్ అమృత ఇనిస్టిట్యూట్ చైర్మన్ ఆర్ భూమినాథన్ ఘనంగా సత్కరించారు. జూలై 24 నుంచి 26 వరకు చైనాలోని చెంగ్డులో జరిగిన 2025 హోటెలెక్స్ చైనా ఇంటర్నేషనల్ చైనీస్ వంటకాల చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత ఆహార కళ ప్రదర్శన (కార్వింగ్) విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుని, భారతదేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. చైనా, థాయిలాండ్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, వియత్నాం, భారతదేశం నుంచి వచ్చిన 175 మంది ప్రొఫెషనల్ చెఫ్‌లలో ఆమె విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా భూమినాథన్ మాట్లాడుతూ భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపును సాధించిన శ్రేయ అనిష్ ఎంబీఏ చదువుకు అయ్యే మొత్తం ఫీజును చైన్నెస్ అమృత ఇనిస్టిట్యూట్ అందిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చెఫ్ కార్తీక్‌ను ఘనంగా సత్కరించగా ఇందులో ఇనిస్టిట్యూట్ సీఈఓవో కవిత నందకుమార్, డీన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.