క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 23 2025 2:45 AM | Updated on Aug 23 2025 2:45 AM

క్లుప

క్లుప్తంగా

కుట్టి పద్మినికి

పురస్కారం ప్రదానం

కొరుక్కుపేట: తమిళనాడు హిందీ సాహిత్య అకాడమీ– చైన్నె, శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాల సంయుక్తంగా ఒక రోజు జాతీయ సెమినార్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న హిందీ పండితులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు విశిష్ట వ్యక్తులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో మొదటి సెషన్‌ ఆరంభమైంది. కార్యక్రమానికి చంద్ర ప్రకాష్‌ గోయెంకా హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా జయశంకర్‌బాబూజీ, ప్రకాష్‌ జైన్‌, మహేష్‌ కుమార్‌ శర్మ, ప్రొఫెసర్‌ డాక్టర్‌ నిర్మలా ఎస్‌. మౌర్య పాల్గొన్నారు. ప్రారంభ సమావేశంలో కుట్టి పద్మినితో పాటు హిందీలో విశేష కృషికి గుర్తింపుగా అనేక మంది ప్రముఖ వ్యక్తులకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. రెండవ సెషన్‌లో, సాహిత్యం, సైన్స్‌, అనుబంధ రంగాలు సహా వివిధ అంశాలపై ప్రసంగించారు. ప్రముఖ కవులు తమ రచనలను ప్రదర్శించిన ప్రత్యేక కవితా పఠన సెషన్‌ కూడా నిర్వహించి ఆకట్టుకున్నారు. కళాశాల విద్యార్థులు కూడా కవితలు పఠించి గొప్ప ప్రశంసలు పొందారు.

తల్లిని కడతేర్చిన కుమారుడు

అన్నానగర్‌: మాధవరం సమీపంలో తల్లిని కొట్టి చంపిన కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సమీపంలోని మాధవరం పొన్నియమ్మన్మేడు తిరుపతి తంగవేల్‌ నగర్‌లో రూపక్‌ పరిమళ (60) నివాసమున్నారు. ఈమె భర్త సెల్వరాజ్‌ కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. వీరి కుమారుడు రూపక్‌ (35) కుటుంబంతో కలిసి బెంగళూరులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మాధవరంలోని ఇంట్లో రూపక్‌ మాత్రమే ఒంటరిగా ఉండేవాడు. రూపక్‌ తన తల్లి వద్దకు నెలకు రెండుసార్లు మాధవరం వచ్చేవాడు. గత వారం, తన తల్లిని చూడటానికి మాధవరం వచ్చిన రూపక్‌, తన తల్లి పరిమళతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో తన తల్లి అని కూడా చూడకుండా పరిమళ జుట్టు పట్టుకుని గోడకు విసిరాడు. తీవ్రంగా గాయపడిన పరిమళను చికిత్స కోసం చైన్నెలోని ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే, చికిత్స ఫలించక పరిమళ శుక్రవారం మరణించింది. ఈ విషయమై మాధవరం పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ భూపాలన్‌ రూపక్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

అన్నానగర్‌: వచ్చే నెలలో తన నిశ్చితార్థం జరగనున్న తరుణంలో ఒక ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన సిల్గురి మాధవ్‌ (28) చైన్నె తిరువాన్మియూర్‌లోని ఒక ప్రసిద్ధ ప్రైవేట్‌ బ్యాంకు రుణ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన సహచరులతో కలిసి తిరువాన్మియూర్‌లో అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. తెలంగాణలో నివసిస్తున్న అతని తల్లిదండ్రులు సిల్గురి మాధవ్‌కు వివాహం చేయడానికి అమ్మాయి కోసం చూస్తున్నారు. ఇతనికి నిశ్చితార్థం వచ్చే నెలలో జరగాల్సి ఉంది. శుక్రవారం వేకువజామున సిల్గురి మాధవ్‌ తన బెడ్‌రూమ్‌లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరువాన్మియూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులు అతని సెల్‌ ఫోన్‌ను పరిశీలించగా, ఆత్మహత్యకు ముందు సిల్గురి మాధవ్‌ మాట్లాడుతున్న వీడియో కనిపించింది. ఆ వీడియోలో, అతను ‘నేను ఈ ప్రపంచంలో జీవించలేను. పెళ్లి తర్వాత నా భార్యను ఎలాంటి చింత లేకుండా ఎలా చూసుకోగలనో అని నాకు భయంగా ఉంది. కాబట్టి నేను ఇక పై ఇలా జీవించలేను. దీంతో నా జీవితాన్ని ముగించుకుంటాను’ అని ఉంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

క్వారీ లారీలను అడ్డుకుని గ్రామస్తుల ఆందోళన

తిరుత్తణి: పట్టణ సమీపంలో క్వారీ లారీలను శుక్రవారం గ్రామీణులు అడ్డుకుని నిరసన తెలిపారు. తిరుత్తణి మండలంలోని సూర్యనగరం పంచాయతీలో రెండు రాళ్ల క్వారీలున్నాయి. మూడేళ్ల నుంచి క్వారీల్లో అనుమతికి మించి రాళ్లు పేల్చి వాహనాల్లో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఎల్లంపల్లె, గజలక్ష్మీపురం యూనియన్‌ రోడ్డు దుస్థితికి చేరుకుని, ఆ దారిలో గ్రామీణులకు రాకపోకలు కష్టంగా మారింది. అవసర సమయాల్లో రాత్రి వేళల్లో ఆ రోడ్డులో ప్రయాణం కష్టంగా మారింది. రోడ్డు బాగు చేయాలని, అనుమతికి మించి రాళ్లు కొట్టి పిండి చేస్తున్న క్వారీపై చర్యలు తీసుకోవాలనే ఆయా గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. అయినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు క్వారీ లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో తహసీల్దారు మలర్‌విళి గ్రామస్తులతో మాట్లాడారు. వెంటనే గ్రామీణ రోడ్డు బాగు చేసేందుకు క్వారీ యాజమాన్యం ముందుకు రావాలని, రాళ్ల తవ్వకంపై కొలతలు తీసి, రిపోర్టు వచ్చే వరకు తవ్వకాలు చేపట్టకూడదని ఆదేశించారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement