
మీతో స్టాలిన్‌ను సద్వినియోగం చేసుకోండి
వేలూరు: మీతో స్టాలిన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సుందరి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి తాలుకా వంజూరు గ్రామంలో మీతో స్టాలిన్ పథకంలో భాగంగా ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఇందులో మొత్తం 15 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొని ప్రజలు ఇచ్చే వినతులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి రశీదులను అందజేయడంతో పాటు కొన్నింటిని అక్కడిక్కడే పరిష్కరించి సర్పంచ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. అధికంగా మహిళా రుణాలు, ఇంటి పట్టాల కోసం వినతి పత్రాలు అందజేయడంతో వాటిపై విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులందరికీ అందజేస్తామన్నారు. కౌన్సిలర్ పెరుమాల్, వైస్ సర్పంచ్ సుమతి, గ్రామ పరిపాలన అధికారి వెంకటేశన్ పాల్గొన్నారు.