
ముగిసిన దీపావళి బుకింగ్
కొరుక్కుపేట: దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. చైన్నెలో నివసించే బయటి జిల్లాల ప్రజలు సాధారణంగా దీపావళికి స్వస్థలాలకు వెళతారు. చివరి నిమిషంలో రద్దీని తట్టుకునేందుకు, వారు రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేందుకు ముందస్తుగా బుక్ చేసుకుంటారు. ఈ ఏడాది దీపావళి సోమవారం, ముందు రోజులు శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో శుక్రవారం తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్రజలు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఈస్థితిలో, అక్టోబర్ 17న చైన్నె నుంచి బయలుదేరే రైళ్ల బుకింగ్ ఆగస్టు 18తో ముగిసింది. అదేవిధంగా, చైన్నె నుంచి క్రమం తప్పకుండా నడిచే ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సులలో చాలా సీట్లు అక్టోబర్ 17, 18 , 19 తేదీలకు రిజర్వ్ అయ్యాయి. పగటిపూట బయలుదేరే బస్సుల సంఖ్య మాత్రమే తక్కువగా ఉంటుంది. అక్టోబర్ 20, 21, 22 తేదీల్లో చైన్నెకి తిరుగు ప్రయాణం కోసం ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో బుకింగ్‌లు వేగంగా జరుగుతున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
పోక్సో చట్టం కింద
యువకుడి అరెస్టు
తిరువొత్తియూరు: బాలికను లైంగికంగా వేధించిన కేసులో పోక్సో చట్టం కింద యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్ రాష్ట్రం సర్వాన్ జిల్లాకు చెందిన వినోద్ మహోత్ (35) గూడువాంచేరి ప్రాంతంలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను నివాసమున్న ప్రాంతంలోని కిరాణా దుకాణంలో ఒక బాలిక ఒంటరిగా ఉండడాన్ని చూసిన వినోద్ మహోత్ కిరాణా దుకాణానికి వెళ్లి ఆ బాలికతో మాట్లాడుతూ తర్వాత తన సెల్‌ఫోన్‌లో ఉన్న అశ్లీల వీడియోలను బాలికకు చూపి, లైంగికంగా వేధించాడు. ఈ విషయం గురించి బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు గూడువాంచేరి మహిళా పోలీస్ స్టేషనన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ షీలా, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉత్తరాది జార్ఖండ్‌కు చెందిన యువకుడు వినోద్ మహోత్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
ఆత్మవిశ్వాసమే
విజయానికి సోపానం
కొరుక్కుపేట: ఆత్మవిశ్వాసమే విజయానికి సోపానం అని విద్యార్థులకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.రాజేంద్రన్ సూచించారు. చైన్నె మందవేల్లిలోని తెలుగు మహాజన సమాజం నిర్వహణలోని శ్రీ వేణుగోపాల్ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ 45వ వార్షికోత్సవాన్ని శుక్రవారం తేనంపేటలోని కామరాజర్ ఆరంగంలో ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల అధ్యక్షుడు కె.అనిల్‌కుమార్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ సి రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా పది, ప్లస్ వన్ , ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనిల్‌కుమార్‌రెడ్డి ఉత్తమ విద్యార్థులకు వాచ్‌లు, మెడల్స్, నగదు బహుమతులు ఇచ్చారు. హెచ్‌ఎం వి.షీలా, పాఠశాల ఉపాధ్యక్షుడు కే ,ఆనంద్‌కుమార్‌రెడ్డి, కోశాధికారి రంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, జేకే రెడ్డి, జె ఎం నాయుడు, గుడిమెట్ల చెన్నయ్య, ఊరా ఆంజనేయులు, కృష్ణారావుపాల్గొన్నారు.
కార్బన్–న్యూట్రల్ పట్టణ పరివర్తనపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
కొరుక్కుపేట: తమిళనాడు గ్రీన్ కై ్లమేట్ కంపెనీ (టీఎన్‌జీసీసీ), తమిళనాడు ప్రభుత్వం భాగస్వామ్యంతో యూకే ప్రభుత్వం సంయుక్తంగా చైన్నెలో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈరోడ్, తూత్తుకుడిలో రెండు యూకే–పీఏ సిటీ (యునైటెడ్ కింగ్‌డమ్–పార్టనరింగ్ ఫర్ యాక్సిలరేటెడ్ కై ్లమేట్ ట్రాన్సిషన్స్) ప్రాజెక్టులపై దృష్టి సారించి కార్బన్–న్యూట్రల్ పట్టణ పరివర్తనలను వేగవంతం చేసే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైన్నెలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ షాలిని మేడేపల్లి, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ జాయింట్ కమిషనర్.పి. జయశీలన్ పాల్గొని మాట్లాడారు.

ముగిసిన దీపావళి బుకింగ్