
క్లుప్తంగా
ఇద్దరు వీసీల
పదవీ కాలం పొడిగింపు
సాక్షి, చైన్నె: రెండు వర్సిటీల వీసీల పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఉత్తర్వులు జారీ చేశారు. కారైక్కుడి అళగప్ప వర్సిటీ వీసీగా ఉన్న ప్రొఫెసర్ చంద్రశేఖర్, తిరునల్వేలి మనోన్మణియం సుందరనార్ వీసీ కె రవి పదవీ కాలం తాజాగా ముగిసింది. దీంతో వీరి పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చైన్నెలో గ్రామోత్సవం ప్రారంభం
– ప్రారంభించిన మంత్రి మహేష్
కొరుక్కుపేట: చైన్నెలోని నందనం వైఎంసీఏ మైదానంలో సెంపోజిల్ సంస్థ తరఫున గ్రామోత్సవం జరుగుతోంది. నగరంలో పుట్టి పెరిగిన వారికి గ్రామోత్సవం, సంప్రదాయ అనుభవాన్ని అందించడానికి ఈ ఉత్సవం ఏర్పాటైంది. గ్రామోత్సవాన్ని పాఠశాల విద్యాశాఖా మంత్రి అన్బిల్ మహేష్ ప్రారంభించారు. అక్కడ కొలువుదీర్చిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ గ్రామోత్సవం 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఉత్సవంలో సంప్రదాయ ఆహార పదార్థాలు, ధాన్యాలు, వ్యవసాయ పుస్తకాలు, చెక్క చేతిపనులు, ఎడ్ల బండ్లు, బండ్లు, గురప్రు బండ్లు, ఉట్టి కొట్టడం వంటి గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా 120కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు.
మహిళ గొంతు కోసి
నగలు దోపిడీ
తిరువళ్లూరు: ఇంట్లో మహిళ వంట చేస్తుండగా ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి ఆమె మెడలో వున్న ఐదు సవర్ల బంగారు నగలను దోచుకెళ్లిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పోలీవాక్కం ప్రాంతానికి చెందిన జీవిత(36). ఈమె భర్త జయచంద్రన్ రియల్టర్. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఈ క్రమంలో జయచంద్రన్ వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లాడు. తల్లితో పాటు కూతురు ఒక్కటే ఉందని గుర్తించిన అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో వున్న బంగారు నగలను లాక్కెళ్లడానికి యత్నించాడు. అయితే ఆమె గట్టిగా పట్టుకోవడంతో జీవిత గొంతును బ్లేడుతో కోసి నగలను లాక్కెళ్లాడు. మనవాలనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య
అన్నానగర్: హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెరంబలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆలత్తూర్ తాలూకా, సిరుగన్పూర్‌కు చెందిన ప్రభాకరన్ (30). ఆలత్తూర్ తాలూకా, కొలకన్నతంలోని ప్రభుత్వ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభాకరన్ తన కుటుంబానికి రాసిన లేఖ గదిలో కనిపించింది. నా మరణానికి ఎవరూ బాధ్యులు కాదని అందులో రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
పుళల్‌లో దూకి
వివాహిత ఆత్మహత్య
అన్నానగర్: పుళల్ చెరువులో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రెడ్‌హిల్స్ సమీపం తీర్థంకరైయంపట్టు పాలవాయల్ ప్రాంతానికి చెందిన శరవణకుమార్. ఇతని భార్య ఈశ్వరి (27). వీరికి ఇద్దరు పిల్లలు. మంగళవారం దంపతుల మధ్య గొడవ చోటుచేసుకుంది. మనస్తాపం చెందిన ఈశ్వరి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తరువాత, ఆమె పుళల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. రెడ్ హీల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
సెల్‌ఫోన్ చోరీ–మహిళ అరెస్ట్
తిరువొత్తియూరు: తిరువల్లికేనిలో సెల్‌ఫోన్‌ను చోరీ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశా రు. చైన్నె, ట్రిప్లికేన్ థైపూన్ అలీఖాన్ వీధికి చెందిన వసంతి (48) సీఏకే రోడ్డులో చిల్లర దుకా ణం నడుపుతోంది. గత నెల 31వ తేదీ రాత్రి ఆమె దుకాణంలో ఉండగా, ఒక యువతి అక్కడికి వచ్చి అత్యవసరంగా ఒకరికి ఫోన్ చేయా లని చెప్పి సెల్‌ఫోన్ తీసుకుంది. తర్వాత మా ట్లాడుతున్నట్లు నటించి సెల్‌ఫోన్ ఎత్తుకుని పా రిపోయింది. ఈసంఘటనపై వసంతి తిరువల్లికేని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా తిరువల్లి కేని ప్రాంతానికి చెందిన సౌమ్య (23)ను అరె స్టు చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఎంఎస్‌ఎంఈల కోసం డిజిటల్ సేకరణ
సాక్షి, చైన్నె : ఎంఎస్‌ఎంఈల కోసం డిజిటల్ సేకరణకు శ్రీకారం చుట్టామని అమెజాన్ బిజినెస్ డైరెక్టర్ మిత్రంజన్ బాధురి తెలిపారు. పండుగ సీజన్ ముందు వ్యాపార కొనుగోళ్లను క్రమబద్ధీకరించే విధంగా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ దారులకు అనుమతి కల్పించే విధంగా చేపట్టిన కార్యాచరణ గురించి గురువారం స్థానికంగా ఆయన ప్రకటించారు. దేశంలో 50 మిలియన్లకు పైగా ఎంఎస్‌ఎంఈల కోసం డిజిటల్ సేకరణ పై దృష్టి పెట్టామన్నారు. ఎంఎస్‌ఎంఈ కొనుగోలు దారులకు సేకరణ తరచూగా ఒక చిక్కుముడిగా ఉంటూ వస్తున్నట్టు వివిరంచారు. బహుళ విక్రేతలు, అస్థిరమైన ధర, సుదీర్ఘ ప్రక్రియలు, వంటి సమస్యలు పరిష్కరించే విధంగా, సేకరణను సరళంగా, సమర్థవంతం చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత సంవత్సరంతో పోల్చితే, కొత్త కొనుగోలు దారులలో 35 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసినట్టు, 70 శాతం కంటే ఎక్కువ వినియోగదారులు టైర్ 2, టైర్ 3 నగరాలల్లోని బలంగా ఉన్నట్టు వివరించారు.