
చోరీ కేసులో ఎనిమిది మంది అరెస్ట్
తిరువళ్లూరు: సేలై గ్రామంలో జరిగిన వేర్వేరు చోరీ కేసుల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా సేలై ఎన్‌జీఓ కాలనీకి చెందిన చిత్రరాజ్. ఇతను రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఈక్రమంలో చిత్రరాజ్ అతడి భార్య గత కొద్ది రోజుల క్రితం చైన్నెలోని కుమారుడి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఈసమయంలో ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో వుంచిన బంగారు నగలు, రూ.1.50 లక్షల నగదు, సిలిండర్, వెండి వస్తువులను చోరీ చేసినట్టు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే ప్రాంతానికి చెందిన యువకులే చోరీకి పాల్పడినట్టు గుర్తించి కార్తీక్, ప్రభు, సెందమిల్, విశాల్, ప్రేమ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. అదేవిధంగా సేలై గ్రామంలో విద్యుత్ వైర్లను చోరి చేసిన సంఘటనలో కలైయరసన్, శ్రీనివాసన్, మూర్తిలను అరెస్టు చేశారు. కాగా అరెస్టయిన ఎనిమిది మంది అదే గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం.
నాటుబాంబులు పేలిన
ఇంటిలో పులి గోర్లు
తిరువొత్తియూరు: తేనిజిల్లా కంబం జల్లికట్టు వీధికి చెందిన గురునాథన్ (67) ఇంట్లో గురువార ం భారీ పేలుడు సంభవించింది. ఇది విని దిగ్భ్రాంతి చెందిన చుట్టుపక్కల వారు పరుగున వెళ్లి చూడగా, గురునాథన్ మనవళ్లు రిథీష్ (7), అభినవ్ (5) తీవ్రంగా గాయపడి ఉన్నారు. వెంటనే వారిని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వేకువజామున బాంబు పేలిన ఇంట్లో పోలీసులు జాగిలాలు సహాయంతో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పేలుడు జరిగిన ఇంటిలో 17 పులి గోర్లు, బాంబు తయారీకి అవసరమైన ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై కంబం పశ్చిమ అటవీ ప్రాంత అధికారి స్టాలినన్‌కు పోలీసులు సమాచారం అందించారు. దీని ఆధారంగా, అటవీ శాఖ అధికారులు ఇంటికి వచ్చి పులి గోర్లను పరీక్షల నిమిత్తం పంపారు. ఇప్పటికే బాంబు పేలుడు ఘటనకు సంబంధించి కంబం ఉత్తర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, పులి గోర్లు దొరకడంతో కంబం పశ్చిమ అటవీ శాఖ కార్యాలయంలో కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మసాజ్ పేరుతో మోసం
– 14 సవర్ల నగలు పోగొట్టుకున్న పూజారి
తిరువొత్తియూరు: స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన పూజరి నుంచి ఓ ట్యాక్సీ డ్రైవర్, అతడి స్నేహితుడు 14 సవర్ల బంగారు నగలు పోగొట్టుకున్నాడు. పోలీసులె చెప్పిన వివరాల మేరకు.. చైన్నె ఎం.జి.ఆర్. నగర్‌లో సీతలై సాతనార్ వీధిలో పూజారి (61) నివసిస్తున్నారు. ఈనెల 8వ తేదీన నీలాంగరైలోని ఒక ఇంటిలో పూజ చేయించడానికి బైక్ టాక్సీని పిలిపించుకుని వెళ్లాడు. ఈక్రమంలో ఐనావరం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడైన బైక్ టాక్సీ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. పూజరి హోమో సెక్యువల్‌కి అలవాటుపడిన విషయాన్ని గమనించిన బైక్ ట్యాక్సీ డ్రైవర్ మసాజ్ పేరుతో.. తన స్నేహితుడిని కూడా పూజారి ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత పూజారిని కరత్రో కొట్టి చంపేస్తామని బెదిరించి, అతను ధరించిన 14 సవర్లు నగలను లాక్కుని పారిపోయినట్లు విచారణలో గుర్తించారు. దీంతో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
దేవాలయాల్లో
పునరుద్ధరణ పనులు
కొరుక్కుపేట: రూ.6,780 కోట్లతో 27,563 దేవాలయాల్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్టు రాష్ట్ర హిందూదేవదాయ శాఖామంత్రి పి.కె.శేఖర్ తెలిపారు. చైన్నె పార్క్ నగర్‌లోని కామాక్షి అమ్మన్ సమేత ఏకాంబరేశ్వరర్ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయాన్ని రూ.5కోట్లతో పునరుద్ధరించి వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 11 దేవాలయాల్లో పవిత్రోత్సవాలు సహా, 3,412 దేవాలయాలల్లో పునరుద్ధరణ పనులు చేశామని తెలిపారు. ఇంతటి చారిత్రాత్మక విజయాలకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కమిషనర్, కార్యదర్శి, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.