
శివాలయాల్లో ప్రదోష పూజలు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని శివాలయాల్లో ప్రదోష పూజలు బుధవారం ఘనంగా నిర్వహించారు ముందుగా తిరువణ్ణామలై అన్నామలైయార్ సన్నిధిలోని పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేదమంత్రాలు నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణ దీపారాధన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మాడవీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. భక్తులు అన్నామలైకు హరోంహర నామస్మరణాలు చేస్తూ స్వామి వారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్‌కు పేద పండితులు వివిధ అభిషేకాలు చేసి పుష్పాలంకరణ చేసి దీపారాధన పూజలు చేశారు. అదేవిధంగా వేలూరు తిరువణ్ణామలై రాణిపేట జిల్లాలోని శివాలయాల్లో శివచార్యులు, వేదపండితులు, అర్చకులు సోనార్లకు పూజలు చేసి మొక్కలు చెల్లించారు.