
అంగన్‌వాడీ వర్కర్ల ధర్నా
పళ్ళిపట్టు: డిమాండ్లు పరిష్కరించాలనే డిమాండ్ మేర కు అంగన్‌వాడీ సిబ్బంది గురువారం ధర్నా చేపట్టా రు. చిన్నారులకు ప్రీస్కూల్ విద్య అందిస్తున్న అంగన్‌వాడీలకు అదనపు బాధ్యతగా ప్రతి చిన్నారికి అంద జే సే పౌష్టికాహారంతో పాటూ గర్భిణులకు, బాలింతలకు అందజేసే పౌష్టికాహారం, పిండి, గుడ్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఫొటో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదే శించింది. దీంతో ఆగ్రహం చెందిన అంగన్‌వాడీల పని బాధ్యతలు పెంచిన క్రమంలో రాష్ట్ర వ్యా ప్తంగా మండ ల కేంద్రాల్లో చిన్నారుల సంరక్షణ కేంద్రాల కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కే పేట, తిరువలంగాడు మండల కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాలో అంగన్‌వాడీలు, సహాయకులు పాల్గొని నిరస న వ్యక్తం చేశారు. తమకు పనిభారం పెంచిన క్రమంలో ప్రభుత్వం 5జీ సెల్‌ఫోన్, 5జీ సిమ్‌తో పాటూ వైపై సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.