అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చైన్నె వాసులు | - | Sakshi
Sakshi News home page

అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చైన్నె వాసులు

Aug 22 2025 3:28 AM | Updated on Aug 22 2025 3:28 AM

అమెరి

అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చైన్నె వాసులు

● అయోమయంలో పళణి ● సివిల్‌ కోర్టు విచారణపై స్టే రద్దు

కొరుక్కుపేట: చైన్నెకు చెందిన ఇద్దరు తెలుగు ప్రముఖులకు అరుదైన గౌరవం దక్కింది. భారతదేశం నుంచి పాల్గొన్న తెలుగు సాహితీ ప్రముఖుల్లో చైన్నెకి చెందిన మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగుశాఖ అధ్యక్షుడు యజ్ఞశేఖర్‌, విశ్రాంత ఉపాధ్యాయిని డాక్టర్‌ ఏవీ శివకుమారిలు 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో పాల్గొని తెలుగు భాష, సాహిత్యాల ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. ఇటీవల అమెరికాలోని టెక్సస్‌ నగరంలో వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, హ్యూస్టన్‌ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త ఆధ్వర్యలో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో అడవి బాపిరాజు నారాయణ నవలపై విశ్లేషణ జరినట్టు డాక్టర్‌ శివకుమారి ఒక ప్రకటనలో తెలియజేశారు.

నిన్న ఊరట.. నేడు షాక్‌

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి కె. పళణి స్వామికి బుధవారంఊరట నిచ్చిన హైకోర్టు, గురువారం పెద్ద షాక్‌ ఇచ్చింది. ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సిటీ సివిల్‌ కోర్టు విచారణకు తాత్కాలికంగా స్టే విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా 2022లో పళణి స్వామి ఎంపికై న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే, ఈకేసును దాఖలు చేసిన వ్యక్తికి అన్నాడీఎంకేతో సంబంధం లేదంటూ పళణి స్వామి తరపున రిట్‌పిటిషన్‌ దాఖలైంది. అయితే, పళణి స్వామి వాదననను తిరస్కరించిన సిటీ సివిల్‌ కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. దీనిని వ్యతిరేకిస్తూ పళణి స్వామి అప్పీలుకు వెళ్లారు. బుధవారం ఈ పిటిషన్‌ హైకోర్టులో విచారణకు వచ్చింది. సిటీ సీవిల్‌ కోర్టు విచారణకు తాత్కాలిక స్టే విధిస్తూ బుధవారం హైకో ర్టు బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేసులో పళణి స్వామికి ఊరట కలిగినట్టైంది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ మూడో తేదీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా బుధవారం స్టే విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం రద్దు చేయడం పళణి స్వామికి పెద్ద షాక్‌గా మారింది. ఇందుకు ప్రధాన కారణంగా ఈ వ్యవహారంలో పళణికి వ్యతిరేకంగా ఉన్న పిటిషనర్‌ సూర్యమూర్తి కేవియేట్‌ పిటిషన్‌ను ఇప్పటికే దాఖలు చేసి ఉండటం వెలుగులోకి రావడం గమనార్హం. తన వాదనను వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని పిటిషనర్‌ విజ్ఞప్తి చేసి ఉండటంతో బుధవారం జారీ చేసిన తాత్కాలిక స్టే ఉత్తర్వులను రద్దు చేస్తూ గురువారం హైకోర్టు బెంచ్‌ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు.

మత్తుమందు ఇచ్చి కూతురిపై అత్యాచారం

– తండ్రికి 66 ఏళ్ల జైలు శిక్ష

అన్నానగర్‌: తన కూతురిపై అత్యాచారం చేసిన నామక్కల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఒక వ్యక్తికి 66 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడ్‌కు చెందిన గణేష్‌ (37). ఇతను తన భార్య, 11 ఏళ్ల కుమార్తెతో నివసిస్తున్నాడు. ఇతను మేకల పెంపకంలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ స్థితిలో, 22.2.2022న, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్‌ తన 6వ తరగతి చదువుతున్న కూతురికి మత్తుమందు ఇచ్చి ఆమైపె అత్యాచారం చేశాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని తన తల్లికి తెలిపింది. ఆమె తన భర్తపై తిరుచెంగోడు ఆల్‌ ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గణేష్‌ను అరెస్టు చేశారు. నామక్కల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో జరిగిన ఈ కేసులో న్యాయమూర్తి మునుస్వామి గురువారం తీర్పు వెలువరించారు. ఇందులో గణేష్‌కు 66 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

దక్షిణ జిల్లాలకు 5 ప్రత్యేక రైళ్లు?

కొరుక్కుపేట: దీపావళి పండుగ అక్టోబర్‌ 20న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా చైన్నెలో నివసిస్తున్న వివిధ జిల్లాల ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం దీపావళి సోమవారం వస్తుంది, దీంతో శనివారం, ఆదివారం సహా వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయి. దీని కారణంగా, ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లడానికి రైళ్లను బుక్‌ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం బుకింగ్‌ మంగళవారం రోజు ప్రారంభమైంది. ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే, ప్రధాన రైళ్లలోని అన్ని సీట్లు బుకింగ్‌ అయిపోయాయి. చైన్నె నుంచి జిల్లాలకు వెళ్లే రైళ్లన్నీ నిండిపోయాయి. అలాగే తిరునల్వేలి, నాగర్‌కోయిల్‌, కోయంబత్తూర్‌, బెంగళూరు వందే భారత్‌ రైళ్లు కూడా నిండిపోయా యి. ఈక్రమంలో దీపావళికి అక్టోబర్‌ రెండవ వా రంలో దక్షిణాది జిల్లాలకు 5ప్రత్యేక రైళ్లు నడపా లని యోచిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చైన్నె వాసులు 1
1/1

అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చైన్నె వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement