
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● వ్యక్తి హత్య ● భర్త సహా ఐదుగురి అరెస్ట్
అన్నానగర్: విల్లుపురం జిల్లా మరకానం సమీపంలోని కూనిమేడు గ్రామానికి చెందిన అబ్దుల్లా కుమారుడు సాదిక్ భాషా (28) పెయింటర్. మంగళవారం రాత్రి తన స్నేహితులు షేక్ అమానుల్లా, ఆషిక్ లతో కలిసి మద్యం సేవించాడు. ఆ సమయంలో, ఆ ప్రాంతానికి కత్తులు, కొడవళ్లతో వచ్చిన అదృశ్య వ్యక్తులు సాదిక్ బాషా తల వెనుక భాగంలో విచ్చలవిడిగా నరికారు. సాదిక్ బాషా రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసి అతనితో ఉన్న అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణ హత్యకు సంబంధించి రాగమతుల్లా (26), భారతి దాసన్ (22), రాజేష్ కుమార్ ఆనందరాజ్ (21), సెల్వకుమార్ (23), గుణశేఖరన్ (22) అనే ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు గురైన సాదిక్ బాషా, రహ్మతుల్లా భార్య మధ్య వివాహేతర సంబంధం ఉందని తేలింది. తన భార్యతో ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న రహ్మదుల్లా, సాదిక్ భాషాను కలిసి, ఆ సంబంధాన్ని ఆపమని హెచ్చరించాడు. అయితే అతను తన భార్యతో ఆ సంబంధాన్ని వదులుకోలేదని తెలుస్తోంది. దీంతో ఆవేశంలో సాదిక్ బాషాను నరికి చంపి, తప్పించుకున్నాడని వెల్లడైంది.
లైంగికదాడి కేసులో 14 ఏళ్ల జైలు
తిరువళ్లూరు: ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని ముత్తాపుదుపేటకు చెందిన ఏడేళ్ల బాలుడిపై అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ గత 2023లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడిపై జరిగిన లైంగిక దాడిపై బాధితుడి తల్లిదండ్రులు ముత్తాపుదుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణలో యువకుడు బాలుడిపై లైగింక దాడికి పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో అతడికి 14 ఏళ్ల జైలుశిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. జరిమాన చెల్లించని ఫక్షంలో మరో ఆరు నెలలు శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.
బెయిల్‌పై వచ్చిన
యువకుడు ఆత్మహత్య
తిరువొత్తియూరు: తండ్రిని హత్య చేసిన కేసులో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నెలోని పెరంబూరులోని బాలమురుగన్ వీధికి చెందిన దినకరన్ (24). ఇతని భార్య అర్చన (22). వీరికి ఒకటిన్నర ఏళ్ల పాప ఉంది. దినకరన్ గత రెండు నెలలుగా తల్లి రాజేశ్వరితో నివసిస్తున్నాడు. దినకరన్ మద్యానికి బానిసయ్యాడని అర్చన అతని నుంచి విడిపోయి వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఈ సమయంలో దినకరన్ తన తండ్రి మనశేఖరన్‌తో గొడవపడి దాడి చేశాడు. దాడిలో తండ్రి మృతిచెందాడు. ఈ కేసులో దినకరన్ జైలుకు వెళ్లి గత నెల 5న బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి మద్యం తాగిన దినకరన్, తల్లితో గొడవ పడ్డాడు. తర్వాత దినకరన్ ఫ్యాన్‌న్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.