
నాటుబాంబుతో యువకుడి హత్యకు కుట్ర
– తిరువళ్లూరులో కలకలం
తిరువళ్లూరు: నాటుబాంబులను విసిరి యువకుడిని హత్య చేయడానికి యత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ చిట్రంబాక్కం గ్రామానికి చెందిన సేతు. ఇతను కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సేతు మంగళవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉండగా కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు నాటుబాంబులను అతనిపై విసిరారు. నాటుబాంబు పేలి సేతుకు స్వల్ప గాయమైంది. వెంటనే స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ చేశారు. సేతుకు, పేరంబాక్కం గ్రామానికి చెందిన ముఖేష్ వర్గానికి మధ్య గంజాయి విక్రయించే అంఽశంపై పాతకక్షలు వున్నట్టు తెలిసింది. గత మూడు నెలల క్రితం సేతు వర్గీయులు ముఖేష్ వర్గీయులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడికి ప్రతీకారంగానే ముఖేష్ వర్గీయులు సేతుపై నాటుబాంబులతో దాడి చేసినట్టు నిర్ధారించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.