మల్లై సత్యపై వైగో వేటు | - | Sakshi
Sakshi News home page

మల్లై సత్యపై వైగో వేటు

Aug 21 2025 7:04 AM | Updated on Aug 21 2025 7:04 AM

మల్లై సత్యపై వైగో వేటు

మల్లై సత్యపై వైగో వేటు

సాక్షి, చైన్నె: ఎండీఎంకేలో మల్లై సత్యపై పార్టీ నేత వైగో వేటు వేశారు. ఆయన్ని తాత్కాలికంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. డీఎంకే నుంచి గతంలో చీలికతో ఆవిర్భవించిన పార్టీ మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే) అన్నవిషయం తెలిసిందే. ఆ పార్టీ వ్యవస్థాపకుడిగా, ప్రధాన కార్యదర్శిగా వైగో వ్యవహరిస్తున్నారు. ఆయన తనయుడు దురై వైగో రాజకీయ ప్రవేశంతో పార్టీకోసం శ్రమించిన ముఖ్య నేతలందరూ బయటకు వెళ్లి పోయారు. ఆయన వైగో నమ్మిన బంటుగా ఉంటూ వచ్చిన మల్లై సత్య ఎన్ని అటు పోట్లు ఎదురైనా పార్టీనే నమ్ముకుని ఉన్నారు. అయితే, దురై వైగో, మల్లై సత్యమద్య తాజాగా వివాదం రాజుకుంది. ఈ వివాదం నేపథ్యంలో వైగో తనను ద్రోహిగా వ్యాఖ్యానించడాన్ని మల్లై సత్య పరిగణించారు. తనకు న్యాయం కావాలంటూ ఆందోళనకు సైతం దిగారు. పార్టీలోకి వచ్చి రాగానే దురైవైగోకు ప్రిన్సిపల్‌ ప్రధాన కార్యదర్శి పదవిఅప్పగించడాన్ని అనేక మంది వ్యతిరేకిస్తూ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మల్లై సత్య వెన్నంటి నిలుస్తూ వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మల్లై సత్యను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూవైగో నిర్ణయం తీసుకున్నారు. వివరణ కోరుతూ ఆయనకు నోటీసులు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement