క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 21 2025 7:04 AM | Updated on Aug 21 2025 7:04 AM

క్లుప

క్లుప్తంగా

యువతితో నిశ్చితార్థం ● పెళ్లి ఆపిన ఐటీ ఉద్యోగి అరెస్ట్‌ కందిరీగలు కుట్టి వృద్ధురాలు మృతి కుక్కకాటుతో వంటమనిషి మృతి ● యజమానికి గాయాలు ఉరి వేసుకుని మహిళా డాక్టర్‌ ఆత్మహత్య రైలు కిందపడి మహిళ మృతి ● భర్తను ఆర్మీకి రైలు ఎక్కించేందుకు వెళ్లిన సమయంలో దారుణం

అన్నానగర్‌: చైన్నెలోని రాయపురానికి చెందిన 30 ఏళ్ల మహిళకు కొన్ని రోజుల క్రితం కుంభకోణంకు చెందిన మణికంఠన్‌ (30)తో నిశ్చితార్థం జరిగింది. ఈ పరిస్థితిలో మరో మహిళ నిశ్చితార్థం చేసుకున్న మహిళను సంప్రదించి, మణికంఠన్‌తో తనకు పెళ్లి అయ్యిందని, వివాహం చేసుకోవద్ద్ఙు అని చెప్పింది. దీంతో యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది, వారు రాయపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఐటీ కంపెనీలో పనిచేస్తున్న మణికంఠన్‌ను విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మణికంఠన్‌ ఇప్పటికే ఒక మహిళను ప్రేమిస్తున్నాడని, అతను ప్రేమించిన మహిళ తనను వివాహం చేసుకోవాలని కోరినప్పుడు, అతను నిశ్చితార్థం చేసుకున్న మహిళకు ఫోన్‌ చేసి వివాహం ఆపమని కోరాడని వెల్లడైంది. దీని తర్వాత, బుధవారం పోలీసులు మణికంఠన్‌ను అరెస్టు చేసి పుళల్‌ జైలుకు పంపారు.

తిరుత్తణి: కందిరీగలు కుట్టి ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కనకమ్మసత్రం సమీపం పూండి మండలంలోని మేట్టుపాళ్యం గ్రామానికి చెందిన రాజేశ్వరి(80). ఈమె మంగళవారం గ్రామానికి శివారులో చెరువు కట్టవద్ద కట్టెలు తెచ్చేందుకు వెళ్లింది. ఆ సమయంలో కందిరీగలు ఆమె దాడి చేశాయి. దాడిలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ ఆమెను స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతిచెందింది. కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నానగర్‌: చైన్నెలోని జాఫర్‌గావ్‌ పేటలోని వి.ఎస్‌.ఎమ్‌ గార్డెన్‌ కు చెందిన కరుణాకరన్‌ (48) వంటవాడు. అతనికి 6 నెలల క్రితం కుడి తొడలో ఫ్రాక్చర్‌ అయి, దానికి చికిత్స చేయించుకున్నాడు. ఈ స్థితిలో, మంగళవారం వంట పనికి వెళ్లి సాయంత్రం తలుపు దగ్గర కూర్చున్నాడు. తన ఇంటి దగ్గర నివసించే పూంగోడి (48) ఓ పిట్‌ బుల్‌ రకం కుక్కను పెంచుతున్నారు. అది గొలుసు తెంచుకుని కరుణాకరన్‌ కుడి తొడపై కరిచింది. ఇది చూసి పూంగొడి భయపడి కుక్కను పట్టుకోవడానికి యత్నించింది. ఆ సమయంలో, అది పూంగోడిని కూడా కరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కరుణాకరన్‌ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. అరుపులు విన్న పొరుగువారు అంబులెన్స్‌ కు సమాచారం ఇచ్చి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ పరీక్షించిన వైద్యులు కరుణాకరన్‌ అక్కడికి చేరుకునే లోపే మృతి చెందినట్లు ప్రకటించారు. కుమరన్‌ నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కరుణాకరన్‌ను రక్షించే క్రమంలో కుక్క యజమాని పూంగోడి కాలు, చేతికి తీవ్ర గాయాలై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర చికిత్స పొందుతున్నారు.

అన్నానగర్‌: కేరళకు చెందిన జువాలా (35) కొన్ని నెలల క్రితం చైన్నెకి వచ్చి అడయార్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్స చేస్తూ వైద్యురాలిగా పనిచేస్తోంది. జువాలా తన భర్తకు ఏడాదిన్నర క్రితం విడాకులిచ్చి ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు పిల్లలు లేరు. విడాకులు తీసుకున్నప్పటి నుంచి జువాలా మనస్తాపంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో, జువాలా బుధవారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యానన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న అడయార్‌ పోలీసులు, జువాలా మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వేలూరు: వేలూరు జిల్లా పొదిగై గ్రామానికి చెందిన ప్రభాకర్‌ ఆర్మీ సిపాయిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య చిత్ర (32) ఉన్నారు. ప్రభాకర్‌ సెలవులు ఆర్మీ నుంచి తన సొంత గ్రామానికి చేరుకొని సెలవుల ముగించుకొని తన భార్యతో పాటూ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కాట్పాటి రైల్వే స్టేషన్‌కు వచ్చారు ఆ సమయంలో వచ్చిన శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రభాకర్‌ ఎక్కారు అనంతరం రైలు బయలుదేరిన వెంటనే ప్రభాకర్‌ గుర్తింపు కార్డు భార్య వద్ద ఉండిపోవడంతో వాటిని అందజేసేందుకు యత్నించింది. ఈక్రమంలో అదుపుతప్పి రైలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. వీటిని గమనించిన ప్రభాకర్‌ వెంటనే రైలు నిలిపి అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement