
ఏజీఎస్ చిత్రం ప్రారంభం
అర్జున్, అభిరామిలతో చిత్ర యూనిట్
తమిళసినిమా: భారీ చిత్రాలతోపాటు, చిన్న చిత్రాలతోనూ మంచి విజయాలను సాధిస్తున్న నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్. ఈ సంస్థ అదినేతలు కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేశ్, కల్పాత్తి ఎస్.సురేష్ ఇంతకుముందు నిర్మించిన గోట్, లవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ నిర్మిస్తున్న 28వ చిత్రం బుధవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో అర్జున్, అభిరామి, ప్రీతీముకుందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జాన్‌కొక్కెన్, దిలీపన్, పవన్, అర్జున్ చిదంబరం, వివేక్ ప్రసన్న, బాలాహాసన్ ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శక, నటుడు ప్రదీప్‌రంగనాథన్ శిష్యుడు సుభాష్ కే.రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి కల్పాత్తి అర్చన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గానూ, అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఐశ్వర్య కల్పాత్తి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవిబస్రూర్ సంగీతాన్ని, అరుణ్ రాధాకృష్ణన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఏజీఎస్ చిత్రం ప్రారంభం