
నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి
కొరుక్కుపేట: విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్ (ఈడీఐఐ) డైరెక్టర్ ఆర్ అంబలవానన్ హితవుపలికారు. ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ –వడపలని మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ 17వ ఇండక్షన్ డేను బుధవారం ఘనంగా నిర్వహించారు . వడపలని క్యాంపస్‌లోని ఎస్‌ఆర్‌ఎం, మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ వి. శశిరేఖ కొత్త విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యఅతిథిగా ఆర్. అంబలవణన్. పాల్గొని ఇండక్షన్ డే ప్రసంగం చేశారు. వ్యాపారం, సమాజ భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన నైపుణ్యాలు – ఆవిష్కరణ, నాయకత్వం వ్యవస్థాపకత ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులను ప్రేరేపించారు.ఈ కార్యక్రమంలో విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డులను ప్రదానం చేశారు.ఇందులో ఎస్. శరవణ కుమార్, బి ఎన్ వై మెల్లన్ (ఎంబీఏ బ్యాచ్ 2012–2014), సంయుక్త జయరామన్(బిబిఏ బ్యాచ్ 2020–2023) అవార్డు అందుకున్నారు. ఈకార్యక్రమంలో అంతర్జాతీయ సమావేశం –2025 ప్రొసీడింగ్స్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.ఎన్. ప్రభాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పి. జయప్రభ , డాక్టర్ ఎస్. విజయకాంత, బీబీఏ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. సుభశ్రీ పాల్గొన్నారు.