
స్టంట్ సిల్వాకు అవార్డు
తమిళసినిమా: ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. దీన్ని అక్షరాలా పాటిస్తున్న ఫైట్ మాస్టర్ సిల్వా. స్టంట్ సిల్వాగా పిలువబడే ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తమిళుడైన ఈయన తమిళంలోనే కాకుండా దక్షిణాది ప్రముఖ స్టంట్ మాస్టర్‌గా రాణిస్తున్నారు. అంతేకాదు, నటుడిగానూ వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ ఆ విధంగానూ గుర్తింపు పొందారు. మొత్తం 100కుపైగా చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేసిన ఈయన ఇప్పటికే పలు అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం అందించే ఉత్తమ స్టంట్ మాస్టర్ అవార్డుతోపాటు సైమా అవార్డు, ఎడిసన్ అవార్డులను గెలుచుకున్నారు. తాజాగా కేరళ ప్రభుత్వం అందించే ఉత్తమ స్టంట్ మాస్టర్ అవార్డును గెలుచుకోవడం విశేషం. మనోరమ కేరళ రాష్ట్రం అందించే ఉత్తమ స్టంట్ మాస్టర్ అవార్డును స్టంట్ సిల్వాను వరించింది. నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ఎంబురాన్ ఎల్ 2 చిత్రం, మోహన్‌లాల్ నటించిన మరో సూపర్‌హిట్ చిత్రం తుడరుమ్ చిత్రాలకు ఫైట్‌మాస్టర్, స్టంట్‌మాస్టర్‌గా పని చేశారు. ఈ చిత్రాలకుగానూ 2025వ ఏడాదికిగానూ మనోరమ కేరళ రాష్ట్ర అవార్డును స్టంట్ సిల్వాకు ప్రదానం చేసి సత్కరించారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్టంట్ సిల్వాను అభినందిస్తున్నారు.
స్టంట్ సిల్వా