
నిషేధిత గుట్కా స్వాధీనం
తిరువళ్లూరు: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నిషేధిత గుట్కా ప్లాస్టిక్ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరులోని వేర్వేరు ప్రాంతాల్లో గుట్కా, ప్లాస్టిక్ వస్తువులు అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు తిరువళ్లూరు మున్సిపల్ కమిషనర్ దామోదరన్‌కు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులో భాగంగానే కమిషనర్ దామోదరన్ నేతృత్వంలోని 20 మంది అధికారులు బజారువీధి, వడక్కురాజవీధితోపాటు దుకాణాలు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ప్రభుత్వం నిషేధించిన గుట్కా, ప్లాస్టిక్ వస్తువులు రెండు టన్నులు పట్టుబడింది. వీటిని స్వాధీనం చేసుకున్న అధికా రులు మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించారు.