
తెలుగు భాషను పరిరక్షించుకుందాం
కొరుక్కుపేట: తెలుగు భాషను పరిరక్షించుకుందామని ప్రముఖ రచయిత్రి, గాయని డా. గుమ్మడి రామలక్ష్మి పిలుపునిచ్చారు.ఈ మేరకు కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాలలో చైతన్య పేరుతో ఏర్పాటైన రెండు రోజుల పోటీలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు మంగళవారం నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు విభాగాల వారీగా అంతర్ కళాశాల పోటీలు నిర్వహించారు. తెలుగు శాఖ అధ్యాపకురాలు డాక్టర్ మైథిలి అధ్యక్షతన, తెలుగు శాఖ సృజన తెలుగు భాషా మండలి తరఫున పోటీలకు డా.గుమ్మడి రామలక్ష్మి పాల్గొన్నారు. వివిధ పోటీల్లో తెలుగు విద్యార్థులు పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. విజేతలుగా నిలిచిన వారికి రామలక్ష్మి బహుమతులను ప్రదానం చేశారు.