క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 20 2025 12:34 PM | Updated on Aug 20 2025 12:34 PM

క్లుప్తంగా

క్లుప్తంగా

రేబిస్‌తో కార్మికుడి మృతి

సేలం: కుక్క కరిచి మగ్గం కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన సేలంలో చోటుచేసుకుంది. సేలం జిల్లా కొంగణాపురం సమీపంలోని ఇలవంపాళయం కుప్పుసామి (43) మగ్గం కార్మికుడు. గత కొన్ని రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు మూడు నెలల కిందట కుక్క కరిచినా అతను చికిత్స తీసుకోలేదు. తీసుకోకపోవడంతో అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. కుటుంబసభ్యులు అతన్ని పరీక్షల కోసం సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతనికి రేబిస్‌ వ్యాధి సోకినట్లు తేలింది. వెంటనే కుప్పుసామిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

ఉద్యోగం పేరుతో

రూ.48లక్షల మోసం

– తండ్రీకూతురు అరెస్ట్‌

అన్నానగర్‌: విదేశాల్లో ఉద్యోగం పేరుతో రూ.48లక్షలు మోసం చేసిన తండ్రీకూతురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. చైన్నెలోని అరుంబాక్కం రామకృష్ణన్‌ వీధికి చెందిన ఆరోగ్యరాజ్‌ (35). ఇతను అరుంబాక్కం క్రైంబ్రాంచ్‌ పోలీస్‌స్టేషన్‌న్‌లో ఒక ఫిర్యాదు చేశాడు. అందులో కేలంబాక్కంకు చెందిన వెంకటేషన్‌ (50). ఇతని భార్య జ్ఞానసుందరి (43), వీరి కుమార్తె మోనిషా (21). వీరు ముగ్గురు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని, మీకు తెలిసిన వారికి చెప్పాలని ఆరోగ్యరాజ్‌తో చెప్పారు. వారి మాటలు నమ్మి, 2023 సంవత్సరంలో తనకు తెలిసిన 24 మంది నుంచి రూ.48 లక్షలు ఇప్పించాడు. చాలా రోజులు అయినప్పటికీ ఉద్యోగం తీసివ్వలేదు, నగదు ఇవ్వలేదు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం వెంకటేషన్‌, కుమార్తె మోని షాను అరెస్టు చేశారు. విదేశాల్లో ఉన్న జ్ఞానసుందరిని అరెస్టు చేయడానికి లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. తండ్రి, కుమార్తెను కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు.

ప్రతిభ చాటిన విద్యార్థులకు ఎడ్యుకేషనల్‌ టూర్‌

కొరుక్కుపేట: చైన్నె కార్పొరేషన్‌ ఆర్థిక నివేదిక ప్రకారం, పబ్లిక్‌ పరీక్షలో అత్యధికంగా మార్కులు సాధించిన 60 మంది విద్యార్థుల కోసం మేయర్‌ ప్రియా విద్యా పర్యటనను ప్రారంభించారు. ప్రభుత్వ పబ్లిక్‌ పరీక్షలో అధిక మార్కులు సాధించి చైన్నె పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థులను విద్యా పర్యటనలకు తీసుకెళ్తామని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆర్థిక నివేదిక ప్రకటించింది. దీని ప్రకారం, గత సంవత్సరం వారిని మహేంద్రగిరి అంతరిక్ష పరిశోధన కేంద్రం, కుడంకుళం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వంటి ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఈ విద్యా సంవత్సరంలో, చైన్నె ఉన్నత , మాధ్యమిక పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, చైన్నె పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న 60 మంది విద్యార్థులను ఎంపిక చేసి, తమిళనాడు పర్యాటక అభివద్ధి సంస్థకు చెందిన ఎయిర్‌ కండిషనన్డ్‌ బస్సులో 10 మంది ఉపాధ్యాయులతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని అంతరిక్ష కేంద్రం, ప్రయోగ వేదిక అయిన శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు తీసుకెళ్లారు. కార్యక్రమాన్ని మేయర్‌ ప్రియ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ ప్రతివిరాజ్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పాల్వాక్కం విశ్వనాథన్‌, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

గాయపడిన డ్రైవర్‌కు

పోలీసుల సాయం

తిరువొత్తియూరు: తిరుచెందూరు ప్రాంగణంలో స్ప్పహ కోల్పోయి ప్రాణాలతో పోరాడుతున్న చైన్నె కార్పొరేషన్‌ డ్రైవర్‌ను కాపాడి ఆస్పత్రిలో చేర్చిన ఆలయ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు, తీరప్రాంత రక్షణ బృందాన్ని భక్తులు అభినందించారు. వివరాలు.. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని నాళికైనారు సమీపంలో నిర్మానుష్యంగా, చీకటిగా ఉన్న ప్రాంతంలో బట్టలు మార్చుకోవడానికి వెళ్లిన చైన్నెకి చెందిన కార్పొరేషన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న జైశంకర్‌ (58) ఉన్నట్టుండి అస్వస్థతకు గురై స్ప్పహ కోల్పోయి ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆ సమయంలో అక్కడ గస్తీలో ఉన్న ఆలయ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు ముత్తుకుమార్‌, సుబిన్‌రాజ్‌ ప్రాణాల కోసం పోరాడుతున్న ఆ వ్యక్తిని చూసి వెంటనే అక్కడి ఆలయ తీరప్రాంత రక్షణ సిబ్బందికి సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు శివరాజా కార్తీక్‌ సర్వేశ్వరన్‌, మహారాజా మారిముత్తు వెంటనే అక్కడికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని అక్కడి నుంచి ఆలయ ఉచిత అంబులెన్స్‌ ద్వారా తిరుచెందూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గంజాయి తరలిస్తున్న

యువకుడి అరెస్టు

తిరువొత్తియూరు: ఒడిశా నుంచి చైన్నెకి రైలులో గంజాయి తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె అన్నానగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ బాలసుబ్రమణియన్‌ మంగవారం పెరంబూరు రైల్వేస్టేషన్‌ జమాలియా ఆటోస్టాండ్‌ ప్రాంతంలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఒడిశా నుంచి రైలులో పెరంబూరు రైల్వేస్టేషన్‌లో దిగిన ఓ యువకుడు పార్శిల్‌ను తీసుకెళ్తుండగా సోదా చేశారు. విచారణలో ఆవడికి చెందిన గంజాయి వ్యాపారి దిలీపన్‌ (23) అని ఇతను భార్యతో కలిసి గత ఐదేళ్లుగా గంజాయి సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఒడిశా, విశాఖపట్నం నుంచి గంజాయిని కొనుగోలు చేసి చైన్నెకి తీసుకొస్తున్నట్లు తెలిసింది. దిలీపన్‌ను పోలీ సులు అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement