
ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన
తిరుత్తణి: పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తిరుత్తణిలో మంగళవారం ఆందోళన చేశారు. మహిళలు సహా 50 మంది సీఐటీయూ శ్రేణులు పాల్గొని చైన్నెలో పారిశుధ్య కార్మికుల పనులను ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రయివేటీకరణ రద్దు చేయాలని, పారిశుధ్య కార్మకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనా సమయంలో విధులు నిర్వహించిన పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ ప్రకటన మేరకు రూ.15వేలు వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ చేశారు.