
బెల్జియం వాసికి చైన్నెలో అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: బెల్జియంకు చెందిన వ్యక్తికి చైన్నె గ్లెనీగల్స్‌లో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. జెడ్– పీఓఈఎం విధానాన్ని అనుసరించి , జీఐ ఎండోస్కోపీ మైలారాయిని చేదించారు. మంగళవారం ఈ వివరాలను గ్లెనీగల్స్‌లో జరిగిన కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీ మహాదేవన్ వెల్లడించారు.బెల్జియంకు చెందిన 75 సంవత్సరాలవ్యక్తికి 15 సంవత్సరాలకు పైగా తీవ్ర మైన వాంతులు, నిరంతరం దగ్గు, జీర్ణ సమస్య ఉంటూ వచ్చిందని వివరించారు. అరుదైన, సంక్లిష్టమైన జెడ్–పీఓఈఎం( పెరో ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమి) ప్రక్రియను ఉపయోగించి ఆయనకు శస్త్ర చికిత్సకు చర్యలు తీసుకుని విజయవంతం చేశామన్నారు.తొలుత రోగి పరిస్థితిని చూసినప్పుడు సంక్లిష్టమైన సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిగణించే అధునాతన విధానం అనుసరించామన్నారు. బెల్జియం వ్యక్తికి చైన్నెలో ఈ అరుదైన చికిత్స జరగడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ నాగేశ్వర్ రావు, డాక్టర్లు బాబుకుమార్, శ్రీనివాస్, కృతిక తదితరులు పాల్గొన్నారు.