
ఐఐటీలో స్మార్ట్ సెంటర్
ఐఐటీ మద్రాసులో స్థిరమైన ఆర్టిఫిషియల్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్‌ను పరిశోధించేందుకు ఫెడెక్స్–స్మార్ట్ సెంటర్‌ను మంగళవారం ఏర్పాటు చేశారు. తొలి ఆవిష్కరణ కేంద్రంగా అత్యాధునిక పరిశోధనలను మిళితం చేస్తూ ఏర్పాటైన ఈ సెంటర్‌ను ఫెడెక్స్‌లోని మిడిల్ ఈస్ట్, ఇండియన్ సబ్‌కాంటినెంట్, ఆఫ్రికా అధ్యక్షుడు కామి విశ్వనాథన్, ఎయిర్ నెట్ వర్క్ ఉపాధ్యక్షుడు నితిన్ నవనీత్ తటివాలా, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి.కామకోటి, డీన్ అశ్విన్ మహాలింగం ప్రారంభించారు. ఈ కేంద్రం కేవలం పరిశోధన కేంద్రంగా మాత్రమే కాకుండా, సాంకేతికత, ప్రతిభ కలిపిన ఒక ఉమ్మడి వేదికగా ఉంటుందని ప్రకటించారు. – సాక్షి, చైన్నె