
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు రూ.5కోట్లు
సాక్షి, చైన్నె: ద్యార్థులకు రూ. 5 కోట్లకు పైగా స్కాలర్ షిప్‌లు, టాపర్లకు పూర్తిగా ఫీజు మినహాయింపు, గ్లోబల్ స్పోర్ట్స్ అవకాశాలను కల్పిస్తూ హిందూస్థాన్ ఇన్‌స్టిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ చర్యలు తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఫ్రెసర్స్‌ను ఆహ్వానిస్తూ మంగళవారం ఫ్రెషర్స్ ఇండక్షన్ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ జాయింట్ జనరల్ మేనేజర్ ఆర్ సేనాపతి, కస్టమ్స్, జీఎస్‌టీ రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎస్ కన్నన్, కేవీఎం ఎక్స్ పోర్ట్స్ ఎండీ డాక్టర్ వికాశ్‌లు హాజరయ్యారు. విద్యార్థులకు విద్య, ఉపాధి, జీవితం గురించిన పలు అంశాలను వివరించారు. ఆ విద్యా సంస్థ చాన్స్‌లర్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్, ప్రొ. చాన్స్‌లర్ డాక్టర్ అశోక్ జార్జ్ వర్గీస్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అభిశామ్, తాత్కాలిక వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎస్. గణేషన్, డిప్యూటీ డైరెక్టర్ ఎనిడ్ వర్గీస్ జాకబ్‌లు వర్గీస్‌లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ప్రోగ్రామ్ ద్వారా రూ. 5 కోట్లకు పైగా విలువైన స్కాలర్ షిప్‌లను ప్రకటించారు. విద్యా, అథ్లెటిక్, కమ్యూనిటీ డొమైన్‌లలో మాత్రమే కాకుండా, సామాజిక– ఆర్థిక అడ్డంకులను విద్యార్థులకు తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. టాపర్లకు వంద శాతం ట్యూషన్ ఫీజును మినహాయించారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ స్కాలర్ షిప్‌ను ప్రకటించారు.