● మాజీ సైనికుల కోసం కొత్త పథకం ● మూడు శాఖలలో ఉద్యోగ నియామక ఉత్తర్వులు ● పర్యాటక డాక్యుమెంటరీకి అవార్డు | - | Sakshi
Sakshi News home page

● మాజీ సైనికుల కోసం కొత్త పథకం ● మూడు శాఖలలో ఉద్యోగ నియామక ఉత్తర్వులు ● పర్యాటక డాక్యుమెంటరీకి అవార్డు

Aug 20 2025 5:31 AM | Updated on Aug 20 2025 5:31 AM

● మాజ

● మాజీ సైనికుల కోసం కొత్త పథకం ● మూడు శాఖలలో ఉద్యోగ నియ

● మాజీ సైనికుల కోసం కొత్త పథకం ● మూడు శాఖలలో ఉద్యోగ నియామక ఉత్తర్వులు ● పర్యాటక డాక్యుమెంటరీకి అవార్డు

సాక్షి, చైన్నె: ఎండ, వాన, చలి, మంచు దుప్పటిని లెక్క చేయకుండా దేశం భద్రత కోసం సరిహద్దులలో అహర్నిషలు సైనికులు శ్రమిస్తున్న విషయం తెలిసిందే. మాతృభూమి కోసం యుక్త వయస్సులోనే ఆర్మీలో చేరి సైనిక సేవ చేసినానంతరం పదవీ విరమణ పొందిన మాజీ సైనికులు ఎందరో కష్టాలను ఎదుర్కొంటున్న విషయాన్ని సీఎం పరిగణించారు. మరెందరో సెక్యూరిటీలుగా అనేక సంస్థలలో పనిచేస్తుండడం గుర్తించారు. అలాగే మరణించిన సైనికుల కుటుంబాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ సైనికుల సంక్షేమం, యుద్ధభూమిలో వీర మరణం పొందిన అమర సైనికుల కుటుంబాలను ఆదుకునే విధంగా కారుణ్య నియామకాల కింద ఉపాధి కల్పన, విద్యా సంస్థలలో సీట్ల రిజర్వేషన్‌ వంటి ప్రక్రియలపై సీఎం దృష్టి కేంద్రీకరించారు. అలాగే మాజీ సైనికుల జీవనోపాధిని మెరుగు పరిచే విధంగా సీఎం రక్షణ కవచం పేరిట ప్రత్యేక పథకం అమలుకు కార్యాచరణను సిద్ధం చేశారు. మాజీ సైనికులు వయస్సు, వారి సేవలను పరిగణించి సురక్షిత జీవితాన్ని అందించే విధంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 155 మంది మాజీ సైనికులకు 30 శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి కల్పన దిశగా రూ. 24.43 కోట్లు కేటాయించారు. వీరికి స్వయం ఉపాధి శిక్షణ, వ్యవస్థాపకులుగా మార్చేందుకు అవసరమైన నిధుల కల్పనకు చర్యలు తీసుకున్నారు. అలాగే తొలి విడతగా 348 మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఈ పథకం మొత్తం వ్యయం రూ. 50 కోట్ల ఒక లక్షతో వివిధ వృత్తులు,స్టార్టప్‌ల కోసం ఒక్కొక్కరికి రూ.కోటి బ్యాంక్‌ రుణాన్ని మొత్తంపై 30 శాతం మూలధన సబ్సిడి, 3 శాతం వడ్డీ సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అర్హులైన మాజీ సైనికులు ప్రయోజనాలు పొందేందుకు వీలుగా ప్రతిజిల్లాలో కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు. ఈ కమిటీ ఆమోదం ఆధారంగా దరఖాస్తులు సంబంధిత బ్యాంకులకు పంపించనున్నారు. భవిష్యత్తులో 500 మంది మాజీ సైనికులకు దీని ద్వారా ప్రయోజనం చేకూర్చనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ శాఖమంత్రి కయల్వెలి సెల్వరాజ్‌, సీఎం మురుగానందం, మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శి రీటా హరీష్‌ ఠక్కర్‌ , డెరెక్టర్‌ సజ్జన్‌ సింగ్‌ రావు చవాన్‌,తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ నియామక ఉత్తర్వులు

అనంతరం జరిగిన కార్యక్రమంలో టీఎన్‌పీఎస్సీ ద్వారా రహదారుల శాఖకు ఎంపిక చేసిన 45 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను సీఎం స్టాలిన్‌ అందజేశారు. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం 2021 మే నుంచి ఇప్పటి వరకు రహదారుల శాఖలో 416 మంది జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లు, 84 అసిస్టెంట్‌ ఇంజినీర్లు, 186 అసిస్టెంట్లు, 139 జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, 73 మంది టైపిస్టులు, 3 ఆడిటింగ్‌ అసిస్టెంట్లు, 7 స్టెనోగ్రాఫర్లు లెవెల్‌ –3 నియామకాలు జరిగినట్టు ఈసందర్భంగా వివరించారు. తాజాగా జరిగిన నియామకంతో మొత్తంగా 1,016 పోస్టులను భర్తీ చేసినట్టు ప్రకటించారు. అలాగే రైతు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీ నిమిత్తం 169 మందిని ఎంపిక చేశారు. మరో 33 మందికి కారుణ్య నియామకం కింద నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. తమిళనాడులో వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ఐదు సార్లు విజయవంతంగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టడమే కాకుండా, ఇప్పటి వరకు వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖలో 1,982 ఖాళీలను భర్తీ చేసినట్టు, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 266 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కేటాయించినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. మొత్తం 2,248 మందికి ఉద్యోగాలు కల్పించామని పేర్కొంటూ, తాజాగా టీఎన్‌పీఎస్సీ ద్వారా 60 మంది వ్యవసాయ అధికారులు, 109 మంది సహాయక అధికారులను నియమించామని ప్రకటించారు. మరణించిన ఉద్యోగుల వారసులకు జూనియర్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ పోస్టులను 33 మందికి అందజేశామని వివరించారు. తదుపరి ప్రజా పనుల శాఖలో ఖాళీల భర్తీ నిమిత్తం టీఎన్‌పీఎస్సీ ద్వారా ఎంపిక చేసిన 165 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. ఇందులో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌) 98 మంది, ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు 67 మందిని ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఈ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌) 406 మంది, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) 103 మంది, సీనియర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నలుగురు, జూనియర్‌ ఆర్కిటెక్ట్‌ మరో నలుగురు, జూనియర్‌ ఒకేషనల్‌ ఆఫీసర్‌గా 156 మంది, జూనియర్‌ అసిస్టెంట్‌ 55 మంది వ్యక్తులు, టైపిస్ట్‌ 32 మంది నియమించినట్టు వివరించారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు ఏవీ వేలు, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, సీఎస్‌ మురుగానందం, రహదారుల శాఖ కార్యదర్శి ఆర్‌. సెల్వరాజ్‌, డైరెక్టర్‌ సెల్వదురై, చీఫ్‌ ఇంజనీర్‌ కెజీ సత్య ప్రకాశ్‌, ప్రత్యేక అధికారి ఆర్‌ చంద్రశేఖర్‌, వ్యవసాయ ఉత్పత్తి విభాగం కమిషనర్‌లు వి. దక్షిణామూర్తి, ఐ, టి. అబ్రహం, పి. మురుగేష్‌, పి. కుమార వేల్‌ పాండియన్‌, వ్యవసాయ ఇంజనీరింగ్‌ విభాగం ఇంజినీర్‌ మురుగేశన్‌, ప్రజా పనుల శాఖ ప్రధాన కార్యదర్శి మంగత్‌ రామ్‌ శర్మ, చీఫ్‌ ఇంజనీర్‌ మణివణ్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యాటకానికి ఉత్తమ అవార్డు

పోటోగ్రాఫర్‌గా సీఎం

ప్రపంచ పోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం స్టాలిన్‌ కాసేపు ఫొటోగ్రాఫర్‌గా మారి పోయారు. తమిళనాడు ప్రెస్‌ ఫొటో గ్రాఫర్‌ అసోసియేషన్‌ తరపున ఫొటో గ్రాఫర్లు హిందూ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎన్‌. రామ్‌తో కలిసి సీఎం స్టాలిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలువురు ఫొటోగ్రాఫర్లు అవయవ దానంకు ముందుకు రాగా, వారికి ప్రశంసాపత్రాలను సీఎం అందజేశారు. అలాగే ఫొటో గ్రాఫర్లందర్నీ ఒక చోట నిలబెట్టి, తాను ఫొటో గ్రాపర్‌ అవతారం ఎత్తి క్లిక్‌ మనిపించారు.

తమిళనాడు పర్యాటక రంగం కోసం రూపొందించిన టైమ్‌ లెస్‌ తమిళనాడు డాక్యుమెంటరీ చిత్రం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ కళ, సంస్కాతిక కేటగిరిలో జాతీయ చలన చిత్ర పురస్కారంగా రజత్‌ కమల్‌ అవార్డును అందుకుంది. ఈ డాక్యుమెంటరీలో నటించిన నటుడు ప్రశాంత్‌, మేనేజ్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ చోటాని, వ్యవస్థాపకురాలు, డైరెక్టర్‌ నిషా చోటాని, దర్శకుడు శ్రీ కామాక్య నారాయణ్‌ సింగ్‌ సచివాలయంలో సీఎం స్టాలిన్‌ను కలిశారు. ఆయనకు అవార్డును పర్యాటక మంత్రి ఆర్‌ రాజేంద్రన్‌ అందజేశారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి కె మణివాసన్‌, విద్యాశాఖ కార్యదర్శి పి. చంద్రమోహన్‌, పర్యాటక శాఖ డైరెక్టర్‌ క్రీస్తురాజ్‌, తమిళనాడు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌. కవిత తదితరులు పాల్గొన్నారు.

● మాజీ సైనికుల కోసం కొత్త పథకం ● మూడు శాఖలలో ఉద్యోగ నియ1
1/2

● మాజీ సైనికుల కోసం కొత్త పథకం ● మూడు శాఖలలో ఉద్యోగ నియ

● మాజీ సైనికుల కోసం కొత్త పథకం ● మూడు శాఖలలో ఉద్యోగ నియ2
2/2

● మాజీ సైనికుల కోసం కొత్త పథకం ● మూడు శాఖలలో ఉద్యోగ నియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement