
సెప్టెంబర్ 19న దండకారుణ్యం
తమిళసినిమా: అట్టకత్తి దినేష్, కలైయరసన్ ప్రధాన పాత్రలు పోషించిన తాజా చిత్రం దండకారుణ్యం. ముత్తుకుమార్, నటి రిత్విక, విన్సు, షబ్బీర్, బాలా శరవణన్, యువన్ మయిల్‌సామి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నీలం ప్రొడక్షన్‌న్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్‌న్ సంస్థల అధినేతలు ఎస్.సాయిదేవానంద్, ఎస్.సాయి వెంకటేశన్, పా.రంజిత్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. అదిరన్ ఆదిరై దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 19న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది అడవి నేపథ్యంలో సాగే ఇద్దరు పోరాటదారుల ఇతివృత్తంతో రూపొందించిన యథార్థ సంఘటనలతో కూడిన కథా చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపాయి. రబ్బర్ బంతు చిత్రం తర్వాత దినేష్ నటించిన చిత్రం ఇదని, అదేవిధంగా వాళై చిత్రం తర్వాత కలైయరసన్ నటించిన ఈ చిత్రం వీరిద్దరికీ చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా దండకారుణ్యం ఉంటుందన్నారు. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, ప్రదీప్ కలిరాజా చాయాగ్రహణం అందించారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు పేర్కొన్నారు.