
అల్యూమినియం తయారీ కేంద్రంగా తమిళనాడు
సాక్షి, చైన్నె: దేశంలోనే అల్యూమినియం తయారీకి అత్యంత ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటిగా తమిళనాడు అవతరించిందని అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జితేంద్ర చోప్రా ప్రకటించారు. మంగళవారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో అలుమెక్స్ ఇండియా 2025 ఎక్స్ పో గురించి వివరాలను ప్రకటించారు. అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ పరిశ్రమలో తమిళనాడు ఒక పవర్‌హౌస్‌గా అవతరించిందన్నారు. ప్రపంచ అవకాశాలను ప్రదర్శించడానికి ఎఎల్‌యూఎంఈఎక్స్ ఇండియా 2025 వేదిక కానున్నట్టు వివరించారు. తమిళనాడు షీట్లు, కాయిల్స్, ఎక్స్‌ట్రూషన్లు, ప్రత్యేక ఉత్పత్తులు, ఆటోమోటివ్, నిర్మాణం వంటి పరిశ్రమలకు సేవలు అందిస్తాయన్నారు. అల్యూమినియం రంగంలో తమిళనాడు పాత్రను అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తించిందని, పరిశ్రమ భవిష్యత్తు. అల్యూమినియం ఉత్పత్తి విస్తృతం కోసం భారతదేశంలో తొలి ఎక్స్‌పో సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో జరగనున్నట్టు ప్రకటించారు. అల్యూమినియం వాల్యూ చైన్ నుంచి 200 కంటే ఎక్కువ ఎగ్జిబిటర్లు, 12,000 కంటే ఎక్కువ వ్యాపార సందర్శకులు తరలిరాబోతున్నారని ఈసందర్భంగా జితేంద్ర చోప్రా ధీమా వ్యక్తంచేశారు. పెట్టుబడులు చైన్నె, ఎన్నూర్ , తూత్తుకుడి ఓడ రేవులతో ఇక్కడి ఉత్పత్తి దారులకు బాకై ్సట్ దిగుమతులు, పూర్తయిన ఖనిజాల ఎగుమతులు రెండింటికీ సమర్థవంతమైన లాజిస్టిక్స్ ప్రయోజనం మరింతగా దక్కబోతున్నట్టు ఆయన వివరించారు.