
పోలీస్ ఫ్యామిలీ ఫస్ట్‌లుక్ విడుదల
తమిళసినిమా: ఆన్ ది టేబుల్ ప్రొడక్షన్‌న్స్ పతాకంపై మలైసామి ఏఎం.రాజా నిర్మిస్తున్న చిత్రం పోలీస్ ఫ్యామిలీ. పరుత్తివీరన్ శరవణన్, కాదల్ సుకుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ముంబయికి చెందిన సురేఖ, నిషాదుబై కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలోని ఒక కీలక పాత్రను నిర్మాత మలైసామి, ఏఎం.రాజా పోషించారు. దీనికి బాలు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు దర్శకత్వం వహించిన పగై మిరల్ చిత్రం త్వరలో విడుదల కానుంది. కాగా పోలీస్ ఫ్యామిలీ చిత్రం వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్మాత మలైసామి ఏఎం.రాజా పేర్కొంటూ ఇది ఎమోషన్‌తో కూడిన సస్పెన్‌న్, క్రైమ్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ చిత్రం ముఖ్యంగా పోలీసులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, వారి కుటుంబసభ్యులకు ఎదురయ్యే ఇబ్బందులు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదన్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు శశికుమార్, పాండిరాజత, పరుర్తువీరన్ శరవణన్, వెట్రి, కాళీవెంకట్, చాయాగ్రాహకుడు పీజీ.ముత్తయ్య సినీ ప్రముఖులు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారని చెప్పారు. షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు.