
సిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: డెర్మాటో ఫైబ్రోసార్కోమా ప్రోటు బెరాన్స్ అనే అరుదైన చర్మ క్యాన్సర్‌తో బాధ పడుతున్న యువ ఐటీ ఉద్యోగికి విజయవంతంగా పుర్రె , తల చర్మం పునర్నిర్మాణంతో చర్మ కణితికి శస్త్ర చికిత్సను చైన్నె సిమ్స్ ఆస్పత్రిలోని మల్టీ డిసిప్లినరీ బృందం నిర్వహించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రానియోఫేషియల్, ప్లాస్టిక్ సర్జరీ విభాగం మాజీ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమూర్తి, కన్సల్టెంట్ డాక్డర్ శ్యామ్‌నాథ్ కృష్ణ పాండియన్ ఈశస్త్ర చికిత్స గురించి మంగళవారం మీడియాకు వివరించారు. డెర్మాటో ఫైబ్రో సార్కోమా ప్రోటు బెరాన్స్ చాలా అసాధారణంగా ప్రతి మిలియన్‌కు 1 నుంచి 5 మంది వ్యక్తులను ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే రుగ్మతతో యువ ఐటీ ప్రొఫెసనల్ బాధ పడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు. ఇది కండరాలు, ఎముకలతో సహా పరిసరాలలోని ఖనజాలలకు వేగంగా వ్యాపించి ఉండడం, ఈ క్యాన్సర్ నెత్తి, పుర్రె మీద తీవ్ర ప్రభావం చూపి ఉంటాన్ని గుర్తించామన్నారు. మెదడు రక్షణే లక్ష్యంగా అత్యంత సంక్లిష్టతో కూడిన శాస్త్ర చికిత్స మీద దృష్టి పెట్టి విజయవంతం చేశామన్నారు. కణితిని తొలగించినానంతరం రోగి పుర్రెను పునర్ నిర్మించామని, స్కిన్ గ్రాఫ్ట్‌లు, ఫ్లాప్స్ టిష్యూ ఎక్స్ పాండర్‌ను రోగి తొడ నుంచి కణజాల భాగాన్ని ఉపయోగించి నెత్తిన చర్మం సైతం పునర్నిర్మించామని పేర్కొంటూ, ఈ ప్రక్రియలో మెటాస్టాటిక్ ఊపిరితిత్తుల నాడ్యూల్ కూడా తొలగించాల్సి వచ్చిందన్నారు. సూర్య రక్షణ, నెత్తి మీద పరిశుభ్రత కోసం రోగికి క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరం అని, పుర్రె మరమ్మతు నుంచి జుట్టును మోసే తల పునర్నిర్మాణం వరకు ప్రతి దశ చాలా జాగ్రత్తతో, పక్కా ప్రణాళిక, విధానాలు, సమన్వయంతో తమిళనాట విజయవంతం చేశామన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని సిమ్స్ చైర్మన్ డాక్టర్‌రవి పచ్చముత్తు అభినందించారు.