
క్రీడలతో చెడు అలవాట్లు దూరం
–మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్
తిరువళ్లూరు: క్రీడలతో చెడు అలవాట్లకు దూరంగా ఉండొచ్చని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ సూచించారు. తిరువళ్లూరు జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు మంగళవారం ఆవడిలోని పోలీసు క్రీడామైధానంలో జరిగాయి. పోటీలను మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి ప్రారంబించారు. మంత్రి నాజర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యం పెరిగి ఆరోగ్యవంతంగా వుండడంతోపాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండొచ్చన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చి క్రీడల మంత్రిగా ఉదయనిధి బాధ్యతలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో మెరుగైన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడం పెరిగిందన్నారు. గత ఏడాది క్రీడల కోసం రాష్ట్ర ప్రభుత్వంరూ.200కోట్లు కేటాయించిదన్నారు. తమ ప్రోత్సాహంతోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్ట వచ్చిందన్నారు. అనంతరం పోటీల్లో విజయం సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఆవడి మేయర్ ఉదయకుమార్, సీఈఓ మోహన పాల్గొన్నారు.