
వాక్‌థాన్‌తో వాస్కులర్ వ్యాధులపై అవగాహన
సాక్షి, చైన్నె: వాస్కులర్ వ్యాధులపై అవగాహన కల్పించే విధంగా చైన్నెలో విద్యార్థులను ఒకే వేదికపైకి తెస్తూ వాక్‌థాన్ కార్యక్రమం సోమవారం జరిగింది. చైన్నె వాస్కులర్ వెల్పేర్ సొసైటీ, వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆళ్వార్ పేట కావేరి ఆస్పత్రి వాస్కులర్ ఫౌండేషన్ డాక్టర్ ఎన్‌శేఖర్ నేతృత్వంలో చైన్నె బీసెంటర్ నగర్ బీచ్ నుంచి వాక్‌థాన్ నిర్వహించారు. వాస్కులర్ వ్యాధులపై అవగాహహన కల్పించే విధంగా, నివారణ గురించి వివరిస్తూ విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నిర్మల్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఐఎఎస్ అధికారి చంద్ర మోహన్, ఎన్‌ఎంసీ మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ శివరామన్ కణ్ణన్ తదితరులు ఈవాక్ థాన్‌లో అడుగులు వేశారు. ఈసందర్భంగా డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ, వాస్కులర్ వ్యాధులు తరచూ అధునాతన దశకు చేరుకుంటున్నదని, ఇది నిశ్శబ్దంగావం చూపించే దిశగా ముందుకెళ్తున్నాయని వివరించారు. అందుకే వాస్కులర్ వ్యాధులపై ప్రజలలో అవగాహన పెంపొందించే కార్యక్రమాల వైపుగా దృష్టి పెట్టామన్నారు.

వాక్‌థాన్‌తో వాస్కులర్ వ్యాధులపై అవగాహన