
చాంపియన్స్ ఆఫ్ చైన్నె అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: కేఎస్‌ఏ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న పలువురు ప్రముఖులకు చాంపియన్స్ ఆఫ్ చైన్నె అవార్డ్స్–2025 ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి చైన్నె మైలాపూర్‌లోని దక్షిణామూర్తి ఆడిటోరియం వేదికై ంది. కేఎస్‌ఏ ట్రస్ట్ ట్రస్టీ టీఆర్ గోపాలకృష్ణన్ స్వాగతోపన్యాసం చేస్తూ అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వందన సమర్పణను ట్రస్టీ కె.కల్యాణరామన్ చేశారు . ముఖ్య అతిథిగా దక్షిణ భారత్ ఏరియా మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఇంద్రబాలన్ పాల్గొని, అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో చాంపియన్స్ ఆఫ్ చైన్నె అవార్డులను నార్త్ చైన్నెకు చెందిన నన్భర్ గల్ గ్రామియ కలై కుళు(ఆర్ట్ అండ్ కల్చర్), యువన్ ఆవేష్(ఎడ్యుకేషన్) , ఫ్లై యింగ్ స్క్వాడ్ అంబులెన్స్ సర్వీస్ (ఎంటర్‌ప్రైజ్), టీటీ రంగనాథన్ క్లినికల్ రీసెర్చ్ ఫౌండేషన్(హెల్త్‌కేర్), అరప్పోర్ ఐక్యం(సోషల్ ఇనిషియేటివ్), విక్టరీ స్పోర్ట్స్ ఫౌండేషన్(స్పోర్ట్స్), స్పేస్ జోన్ ఇండియా ఆనంద మేగలింగం(సైన్స్) లకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా కేఎస్‌ఏ ట్రస్ట్ తొలిసారిగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు.