
వాణిజ్య అధికారులకు శిక్షణ
సాక్షి, చైన్నె: వండలూరులో పోలీసు శిక్షణ కేంద్రంలో 190 మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంత్రులు అన్బరసన్, మూర్తి ప్రారంభించారు. వాణిజ్య పన్ను అధికారుల పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు ఈ శిక్షణ శిబిరం సెప్టెంబరు 30వ తేదీ వరకు జరగనున్నాయి. వాణిజ్య పన్ను శాఖ కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలు, నియమాలు, విధానాలు, బాధ్యతలు, తాజా పన్ను చట్టాలు, పన్ను సేవా మెరుగుదల ప్రాజెక్టులు, అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం గురించి అవగాహన కల్పించనున్నారు. రోజువారీ భౌతిక, మానసిక ఆరోగ్యానికి యోగాతో శిక్షణ కూడా ఇవ్వనన్నారు. సాంకేతిక నిపుణులచే ప్రత్యేక కార్యక్రమాలు జరగనన్నాయి.ఈ కార్యక్రమానికి వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శిల్ప ప్రభాకర్ సతీష్, కమిషనర్ ఎస్. నాగరాజన్, చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ టి.స్నేహ, చెంగల్పట్టు శాసన సభ్యురాలు వరలక్ష్మి మధుసూదనన్, తమిళనాడు పోలీస్ ఉన్నత శిక్షణ సంస్థ, వాణిజ్య పన్ను శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.