
రోగులకు అవసరమైన వసతులు
వేలూరు: పెంట్‌ల్యాండ్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అవసరమైన వసతులన్నీ సిద్ధం చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. గత రెండు నెలల క్రితం సీఎం స్టాలిన్ చేతులమీదుగా పెంట్‌ల్యాండ్ ప్రభుత్వాస్పతిని ప్రారంభించారు. అయినప్పటికీ ఎటువంటి వసతులు లేకపోవడంతో రోగులను అనుమతించలేదు. దీంతో ప్రతి పక్ష పార్టీలు దీనిపై పలు విమర్శలు చేయడంతోపాటు వేలూరులో అన్నాడీఎంకే పార్టీ ధర్నాలు నిర్వహించి రోగులకు అవసరమైన వసతులు కల్పించకుండా ఆస్పత్రిని ప్రారంభించారని నినాదాలు చేయడంతో ఆస్పత్రిని మూసి వేశారు. ప్రస్తుతం వార్డులను ప్రారంభించి రోగులను అనుమతించారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆస్పత్రిలో రోగుల వద్ద వసతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అవసరమైన ఓపీ వసతి, వార్డుల్లోని కనీస వసతులున్నాయా అనే వాటిని తనఖీ చేశారు. కలెక్టర్‌తో పాటు కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్, వైద్యాధికారులు పాల్గొన్నారు.