
శ్రీకృష్ణుని ఆలయాల్లో అభిషేకాలు
వేలూరు: శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో శ్రీ కృష్ణుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. శనివారం సాయంత్రం వేలూరులోని శ్రీ కృష్టుడి ఆలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వేలూరు తోటపాళ్యంలోని శ్రీకృష్ణ ఆలయంలో యువకులచే ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణలు చేశారు. అదేవిధంగా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలోని నవనీత చిన్ని కృష్టుడికి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లోకక్షేమం కోసం ప్రత్యేక హోమపూజలు చేశారు. అదేవిధంగా వేలూరు ఉమ్మడి జిల్లాతో పాటు తిరువణ్ణామలై జిల్లాలోని శ్రీకృష్ణుడి ఆలయాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.