క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 18 2025 6:09 AM | Updated on Aug 18 2025 6:09 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

కారు ఢీకొని

ఉద్యోగి దుర్మరణం

తిరువొత్తియూరు: బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఒక విద్యుత్‌ శాఖ ఉద్యోగి దుర్మురణం చెందాడు. చైన్నె పాలవాక్కంకు చెందిన అశోక్‌కుమార్‌ (30) చైన్నెలో విద్యుత్‌శాఖలో పనిచేస్తున్నారు. ఇతని భార్య అనుప్రియ. వీరికి మేఘవ్‌(2) అనే కుమారుడు ఉన్నాడు. గత రెండు రోజుల క్రితం అశోకుమార్‌ భార్య, కుమారుడితో కలిసి నాగపట్టణం జిల్లా, తిరుప్పుగళూరులోని అత్తగారింటికి వెళ్లాడు. శనివారం అశోక్‌కుమార్‌ భార్య, కుమారుడుతో కలిసి తిరువారూర్‌ జిల్లా నన్నిలం సమీపంలోని ఒక ఆలయానికి బైక్‌లో వెళ్లాడు. నన్నిలం సమీపంలోని నాలుగు రోడ్ల రౌండ్‌ ఠాణా మలుపు వద్ద వెళుతుండగా తిరుచ్చికి చెందిన అవినాష్‌బాబు (24) నడుపుతున్న కారు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అశోకుమార్‌, అనుప్రియ, మేఘవ్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరు కుని తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో అశోక్‌కుమార్‌ మృతిచెందాడు. అనుప్రియ, మేఘవ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

షేర్‌ మార్కెట్‌లో నష్టం

– మహిళ ఆత్మహత్య

తిరువొత్తియూరు: ĶæÊr*Å»Œæ ^èl*íÜ B¯ŒS-OÌñæ-¯Œ-¯ŒSÌZ õÙÆŠ‡ Ð]l*Æð‡P-sŒæÌZ ò³r$t-ºyìl ò³sìæt Æý‡*.2.5 ÌS„ýSË$ ´ùVör$t-MýS$¯]l² Ð]l$íßæâýæ, ¿ýæÆý‡¢MýS$ ÐésêÞ-‹³ ÌZ çÜÐ]l*-^éÆý‡… ç³…í³ B™èlÃ-çßæ™èlÅ ^ólçÜ$-MýS$…-¨. ^ðlO¯ðl² ç³ÌSÏ-Ð]lÆý‡… çÜÒ$ç³…ÌZ° ´÷ã-^èla-Ë*Æý‡$, gêq¯]lÐ]l$×ìæ ¯]lVýSÆŠ‡ 3Ð]l Ò«¨MìS ^ðl…¨¯]l AÆý‡$׊æ (44). C™èl° ¿êÆý‡Å Ð]l¯]l-f(38). ¨ÐéÅ…VýS$-Oyðl¯]l AÆý‡$׊æ ò³Æ‡$$…sìæ…VŠæ yìlOgñæ-¯]lÆŠ‡V> ç³°^ól-çÜ$¢-¯é²yýl$. D{MýS-Ð]l$…ÌZ Ð]l¯]lf ĶæÊr*Å»Œæ ^èl*íÜ B¯Œ-¯ŒS-OÌñæ-¯Œ¯ŒS õÙÆŠ‡ Ð]l*Æð‡P-sŒæÌZ _¯]l² Ððl¬™èl¢…ÌZ ò³r$t-ºyìl ò³sìæt…-¨. ©…™ø B§éĶæ$… Æð‡sìæt…ç³# AƇ$$Å…-¨. GMýS$PÐ]l yýlº$¾ ò³r$tºyìl ò³yìl™ól GMýS$PÐ]l Ìê¿ýæ… Ð]lçÜ$¢…§ýl° ¿êÑ…_¯]l Ð]l¯]l-f, ¿ýæÆý‡¢MýS$ ™ðlÍ-Ķæ$-MýS$…yé, JMýS ÌZ¯ŒS Ķæ*‹³ §éÓÆ> ₹2.5 ÌS„ýSÌS A糚 ¡çÜ$-MýS$-°, ÝëtMŠS Ð]l*Æð‡P-sŒæÌZ ò³sìæt…-¨. AƇ$$™ól, BÐðl$MýS$ Ìê¿ýæ… Æ>Ìôæ§ýl$. A糚 †ÇW ^ðlÍÏ…-^èlÐ]l$° J†¢yìl ^ólĶæ$-yýl…™ø Ð]l$¯]lçÜ$ ÑÇW-´ù-Ƈ$$¯]l Ð]l¯]l-f, C…sZÏ GÐ]lÆý‡* Ìôæ° çÜÐ]l$-Ķæ$…ÌZ EÇ-ÐólçÜ$MýS$° B™èlÃ-çßæ™èlÅ ^ólçÜ$-MýS$…-¨. Ôèæ…MýSÆŠ‡ ¯]lVýSÆŠ‡ ´ùÎ-çÜ$Ë$, Ð]l¯]lf Ð]l$–™èl-§ól-à°² ´ù‹Üt-Ð]l*-Æ>-t-°MìS {MøÐŒl$-õ³sŒæ {糿¶æ$™èlÓ Bçܵ-{†MìS ™èlÆý‡Í…-^éÆý‡$.

లారీని ఢీకొన్న కారు

–ఇద్దరు మహిళలు దుర్మరణం

–ముగ్గురికి తీవ్రగాయాలు

తిరువొత్తియూరు: కోవై సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో చైన్నెకి చెందిన ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. చైన్నె అంబత్తూరుకు చెందిన లావణ్య (40), మలర్‌ (40) అనే వీరిద్దరూ కుటుంబాలతో కలిసి రెండు రోజుల క్రితం చైన్నె నుంచి కేరళలోని కొచ్చికి పర్యాటకానికి వెళ్లారు. ముగించుకునిఆదివారం తెల్లవారుజామున చైన్నెకికారులో బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున కోయంబత్తూరు జిల్లా వాలైయార్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో వెలుతుండగా అక్కడ ఆగివున్న లారీని కారు అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వాలైయార్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ కాసిహా, కృతిక్‌ రోషన్‌ (14), దీప (8)లను కోవై ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైల్వే గేట్‌మన్‌ సస్పెన్షన్‌

తిరువొత్తియూరు: లెవల్‌ క్రాసింగ్‌ వద్ద రైల్వే గేట్‌ వేయక పోవడంతో గేట్‌మన్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. రామేశ్వరం నుంచి శనివారం ఉదయం 5.40 గంటలకు మదురైకి వెళ్లే ప్యాసింజర్‌ రైలు బయలుదేరింది. ఈ రైలు పాంబన్‌, మండపం, ఉచ్చిపుళి రైల్వేస్టేషన్లను దాటి రామనాథపురం వైపు వెళుతోంది. రామనాథపురం, వళుదూర్‌ మధ్య ప్రాంతంలో వెళుతుండగా, వాలాంతరవై ప్రాంతంలోని రైల్వే గేటు తెరిచి వుంది. వాహనాలు గేటును దాటి వెళ్లడాన్ని దూరం నుంచే గమనించిన ఇంజిన్‌ డ్రైవర్‌ వెంటనే రైల్వే గేటుకు 100 మీటర్ల దూరంలో రైలును నిలిపివేశారు. రైలు నుంచి దిగి రైల్వే గేటు వద్దకు వెళ్లి గేట్‌మన్‌తో గేట్‌ వేయించాడు. తర్వాత ఇంజిన్‌ డ్రైవర్‌ రైలును నడిపాడు. ఇంజిన్‌ డ్రైవర్‌, మదురై డివిజనల్‌ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఈ ఘటనపై డ్యూటీలో నిర్లక్ష్యం వహించినందుకు రైల్వే అధికారులు గేట్‌మన్‌ను సస్పెండ్‌ చేశారు.

భక్తులతో పోటెత్తిన బోయకొండ

చౌడేపల్లె: కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులపాలిట వరాలిచ్చే ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో బోయకొండకు చేరుకుని అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో క్యూలైన్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనెదీపాలు, మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement