
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
కొరుక్కుపేట: శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. చైన్నె ఆళ్వార్‌పేట, టీటీకే రోడ్డులోని మ్యూజిక్ అకాడమీ దీనికి వేదికై ంది. అసోసియేషన్ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో యూఎస్‌ఏకు చెందిన ఎస్‌ఎస్ శశాంక భక్తిగీతాలాపనలు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి చెందిన సుచరిత, సుప్రజ బృందం కూచిపూడి నృత్యం ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణం వందే జగద్గురుం – ప్రతిభా పురస్కారాలను నటి లయ, నటి నమిత ప్రదానం చేశారు. ముందుగా కర్ణాటక, క్లాసికల్ సంగీత కళాకారిణి శ్వేత మంగళంపల్లి బృందం నాదార్పణం, తర్వాత కార్యక్రమంలో శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ సభ్యులతో పాటు పుర ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు.