
పూర్వవిద్యార్థుల కలయిక
కొరుక్కుపేట: చైన్నెలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండ్ చారిటీస్ నిర్వహణలోని ఎస్‌కేపీడీ హాస్టల్ పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఎస్‌కేపీ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. దీనికి అసోసియేషన్ అధ్యక్షుడు టి.జగదీష్‌బాబు అధ్యక్షత వహించారు. 74 మందికిపైగా పూర్వవిద్యార్థులు పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పూర్వవిద్యార్థుల అసోసియేషన్ తరఫున హాస్టల్‌కు ఇండక్షన్ స్టవ్ , 18 మంది విద్యార్థులకు ట్రావెల్ బ్యాగ్‌లు, మెరిట్ విద్యార్థులకు ఆర్ధిక సాయం, సీనియర్ సభ్యులు, అతిథులకు మెమెంటోలు బహూకరించి సత్కరించారు. కార్యక్రమంలో జయరాజ్ గ్రూప్ ఎండీ రాజశేఖర్ తాడేపల్లి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ, అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి గుర్రం బాలాజీ, ఉపాధ్యక్షుడు నరసింహన్, కోశాధికారి ఎస్ రాములు, రాధాకృష్ణమూర్తి, కె.గోపాల్‌శెట్టి పాల్గొన్నారు.