
కనకదుర్గా శతకం పుస్తకావిష్కరణ
కొరుక్కుపేట: తెలుగు భాషా ప్రక్రియల్లో శతక ప్రక్రియకు ప్రత్యేక స్థానం ఉందని, నేడు 108 పద్యాలతో శ్రీ కనకదుర్గా శతకం రావడం అభినందనీయమని జలదంకి కోదండరామ రెడ్డి, ఆచార్య విస్తాలి శంకరరావు, రాంబాబు అన్నారు. ఆదివారం ఉదయం చైన్నె మైలాపూర్‌లోని అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు స్మారక భవనం వేదికగా, జనని సాంఘీక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు గుడిమెట్ల చెన్నయ్య నిర్వహణలో, జనని అధ్యక్షురాలు నిర్మల సభాధ్యక్షతన కవి, రచయిత, డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ రాసిన శ్రీ కనకదుర్గా శతకం పుస్తకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషాభిమాని శోభారాజ పుస్తకం తొలి ప్రతిని అందుకున్నారు. మన్నవ గంగాధర ప్రసాద్ మాట్లాడుతూ 2008 లో ప్రారంభించిన ఈ శతకం కొన్ని అనివార్య కారణాల రీత్యా మధ్యలో ఆపగా నేడు జనని సంస్థ వల్ల పుస్తక రూపంలోకి తీసుకురావడం, చైన్నెలో ఆవిష్కరించడం ఆనందమన్నారు. డాక్టర్ మోహనశ్రీ , లక్ష్మీకాంత్, సగలి సుధారాణి, అభ్యుదయ రచయితల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు యువశ్రీ, కథా రచయిత పేరూరు బాలసుబ్రమణ్యం, టీచర్‌ఏడుకొండలయ్య, సంగీత దర్శకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.