
భజన పోటీలకు అనూహ్య స్పందన
కొరుక్కుపేట: జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్)– చైన్నె ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం నిర్వహించిన వార్షిక భజన పోటీలకు అనూహ్య స్పందన లభించింది. టీ.నగర్‌లోని పీఆర్‌సీ సెంటినరీ హాలులో జరిగిన పోటీలకు వివిధ పాఠశాలల నుంచి 26 బృందాలు సీనియర్, జూనియర్ విభాగాల్లో పాల్గొన్నారు. చిన్నజీయర్‌స్వామి మంగళాశాసనాలతో జెట్–చైన్నె అధ్యక్షుడు పి. రవీంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన పోటీలకు శ్రీ సిటీ అధినేత రవిసన్నారెడ్డి పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలతోపాటు వెండి, రజిత పతకాలతో రవిసన్నారెడ్డి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు.