తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడటం విచారకరం అని సీఎం స్టాలిన్‌ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు గవర్నర్‌ ద్వారా నీచ రాజకీయాలను చేయడం తగదని హెచ్చరించారు. చౌక బారు విమర్శలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. | - | Sakshi
Sakshi News home page

తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడటం విచారకరం అని సీఎం స్టాలిన్‌ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు గవర్నర్‌ ద్వారా నీచ రాజకీయాలను చేయడం తగదని హెచ్చరించారు. చౌక బారు విమర్శలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.

Aug 18 2025 6:03 AM | Updated on Aug 18 2025 6:03 AM

తమిళు

తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడటం విచార

చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు

నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ కేంద్రంపై మండిపాటు

ధర్మపురిలో క్షేత్రస్థాయి పర్యటన

దరఖాస్తు చేసుకున్న రోజే రైతులకు రుణాలు

మురసోలి మారన్‌కు నివాళి

రెతులకు పంట రుణాలకు గాను చెక్కులను అందజేస్తున్న సీఎం స్టాలిన్‌

మురసోలి మారన్‌ ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న సీఎం స్టాలిన్‌

సాక్షి, చైన్నె : సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదివారం ధర్మపురిలో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. ఆదియమాన్‌ కోట్టైలో జరిగిన కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార రుణ సంఘాల నుంచి దరఖాస్తు చేసుకున్న రోజే పంట రుణాలు అందించే కొత్త పథకంకు శ్రీకారం చుట్టారు. దేశానికే మార్గదర్శకంగా నిలిచే విధంగా ఈ ప్రాజెక్టును సీఎం ప్రకటించారు. ఇది వరకు వారం రోజులు సమయం పట్టేదని, ఇక దరఖాస్తు చేసుకున్న రోజే జాప్యం లేకుండా రైతుల బ్యాంక్‌ ఖాతాలలో పంట రుణాలు జమ చేసే విధంగా పైలట్‌ ప్రాజెక్టుగా అమల్లోకి తీసుకొచ్చారు. తొలి విడతగా ధర్మపురి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకారం రుణ సంఘాలలో ఐదుగురు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోగా, వారికి రుణాలను సీఎం అందజేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పొదుపు ఖాతా నంబరును ఉపయోగించి రుణానికి దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలు రెవెన్యూ శాఖ లేదా వ్యవసాయ శాఖ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

దిగజారుడు రాజకీయాలు..

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను విజయవంతంగా అమలు చేస్తూ ముందుకెళ్తున్న తమ మీద నిందలు వేయడమే లక్ష్యంగా ప్రయత్నాలను విస్తృతం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం తమిళనాడులో అమలులో ఉన్న పథకాలు, ప్రాజెక్టులను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారని , దీనిని బట్టి చూస్తే దేశ అభివృద్ధికి తమిళనాడు తోడ్పాటుగా ఉండటమే కాదు, ప్రాజెక్టులలో తమిళనాడు అగ్రగామి రాష్ట్రంగా అవతరించి ఉందన్నారు. భారతదేశానికి దిక్సూచిగా తమిళనాడు మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకి , దుర్మార్గపు శక్తులు బురద చల్లడమే ధ్యేయంగా ముదుకెళ్తున్నాయని మండి పడ్డారు. ప్రతి పక్షాలు విమర్శిస్తే, రాజకీయ నాయకులకు పరిపాటే అనుకోవచ్చు అని, అయితే, తమిళనాడులో కీలక పదవిలో ఉన్న వ్యక్తి చౌక బారు రాజకీయాలు చేస్తుండటం శోచనీయమని విమర్శించారు. ఈ రాజకీయాలు చేస్తున్నదెవరో కాదని, గవర్నర్‌ అని వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్షాలు ఎన్ని చెప్పినా వాటితో తనకు పని లేదని, అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వారా నియమితులైన గవర్నర్‌ డీఎంకే పాలనను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఆయన ద్రావిడ వాదాన్ని విమర్శిస్తారే గానీ, చట్టాలను మాత్రం ఆమోదించరని విమర్సించారు. తిరుక్కురల్‌ను ముద్రించి పంపిణీ చేస్తారని, తమిళంలో మాట్లాడుతానంటూ వ్యాఖ్యల చేస్తాని, అయితే, ఆచరణలో తమిళనాడును అవమానించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్‌ తీరును వివరిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు విద్యార్థులను అవమానిస్తాడని, ప్రజల్లో భయాన్ని వ్యాపింపచేసే విధంగా చర్యలు ఉంటాయని మడిపడ్డారు. తమిళనాడు అత్యున్నత రాష్ట్రంగా అవతరించిందని కేంద్ర వెల్లడించే జాబితాలలోనే స్పష్టం చేస్తుంటే, గవర్నర్‌ వ్యాఖ్యలు మాత్రం భిన్నంగా విమర్శలతో కూడుకుని ఉండడం విచారకరం అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తమిళనాడు అన్ని విధాలుగా సురక్షితం అని, దీనిని ఓర్వలేకే బహిరంగంగా గవర్నర్‌ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని, తమిళనాడుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని మండిపడ్డారు. బీజేపీ పాలిక రాష్ట్రాలలో నేరాలు ఏ మేరకు పెట్రేగుతున్నాయో గవర్నర్‌ గమనిస్తే.. మంచిదని హితవు పలికారు. తమిళానికి, తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా నీచ, దిగజారుడు రాజకీయాలను, చౌకబారు విమర్శలుమానుకోవాలని హెచ్చరించారు.

బ్రహ్మరథం..

క్షేత్రస్థాయి పర్యటన నిమిత్తం సేలం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం స్టాలిన్‌కు డీఎంకే వర్గాలు, ప్రజలు బ్రహ్మరథం పట్టాయి. రోడ్డు మారగలో ఆయన ధర్మపురికి వెళ్లారు. అడుగడుగునా జన నీరాజనాలు లభించాయి. ధర్మపురిలోని తండంగంలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి మురసోలిమారన్‌ జయంతి సందర్భంగా, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రభుత్వ వేడుకలో రూ. 362 కోట్ల 77 లక్షల విలువైన 1,073 పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ. 512 కోట్ల 52 లక్షల అంచనా వ్యయం వివిధ శాఖల తరపున చేపట్టనున్న 1044 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. రూ. 830 కోట్లు విలువగల సంక్షేమ పథకాలను 70,427 మంది లబ్ధిదారులకు అందజేశారు. పూర్తైన ప్రాజెక్టులలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ కార్యాలయాల భవనాలు, వంతెనలు, పాఠశాలలకు అదనపు తరగతి గదులు, ఆరోగ్య కేంద్రాల భవనాలు, కమ్యూనిటీ సెటర్లు, ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌లు, బోరు బావులు, ఈసేవా కేంద్రాల భవనాలు, రోడ్లు, తదితర పనులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, ఏవీ వేలు, పెరియకర్పున్‌, ఆర్‌ రాజేంద్రన్‌, ఎంపి మణి, ఎమ్మెల్యే ఎస్‌పీ వెంకటేశ్వరన్‌, జిల్లా కలెక్టర్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులోకి రుణాలు..

ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ప్రసంగిస్తూ, అన్నదాత సమాజానికి పంట రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టామన్రాను. రైతుల ప్రయోజనాల దృష్ట్యా, ఎలాంటి జాప్యం అననది లేకుండా ఇక రుణాలు ఖాతాలలో జమ అవుతాయన్నారు. ధర్మపురి అభివృద్ధి ద్రావిడ పురోగతి అని, హొగ్నెకల్‌ ఉమ్మడి తాగు నీటి ప్రాజెక్టు ఘనత తమదేనని ధీమా వ్యక్తంచేశారు. ఈసందర్భంగా ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలకు తమ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.ఈ నాలుగు సంవత్సరాలలో ధర్మపరి జిల్లాకు రూ. 447 కోట్లు వెచ్చించామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కొన్ని కొత్త ప్రకటనలు చేశారు. చిత్తేరి పంచాయతీ పరిధిలోని కొండ గ్రామాలు, చిన్నం కుప్పం, గోపిశెట్టిపాళ్యంతోపాటుగా ఉన్న పరిసర గ్రామాల ప్రజలకు పాపి రెడ్డి పట్టి గ్రామాలను అరూర్‌ రెవెన్యూ తాలుకాల విలీనం చేస్తున్నామని ప్రకటించారు. హొగ్నెకల్‌ – ధర్మపురి మార్గంలోని ఆట్టుకారన్‌ పట్టి నుంచి పెన్నగరం వరకు 25 కి.మీ దూరం రోడ్డును ఫోర్‌వేగా విస్తరించనున్నామని వివరించారు.రూ. 165 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నామన్నారు. నల్లంపల్లి పంచాయతీ యూనియన్‌లోని పారికం నుంచి మలైయూర్‌ వరకు అటవీ రహదారినిఇ రూ. 10 కోట్లతో అప్‌ గ్రేడ్‌ చేయనున్నామన్నారు. చింతపండు ఉత్పత్తిలో ప్రసిద్ది చెందిన ఈ జిల్లాలోని రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూ.11.30 కోట్లతో ఇంటి గ్రేటెడ్‌ చింత పండు ట్రేడింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. అరూర్‌ మునిసిపాలిటీలో నివసిస్తున్న ప్రజల సంక్షేమం కోసం వల్లిమధురై నీటి సరఫరా ప్రాజెక్టు కొత్త పైపులను ఏర్పాటు చేయనున్నామని రూ. 15 కోట్లతో ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడటం విచార1
1/3

తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడటం విచార

తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడటం విచార2
2/3

తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడటం విచార

తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడటం విచార3
3/3

తమిళుల మనో భావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడటం విచార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement