
క్రీడాకారులకు అభినందనలు
సాక్షి,చైన్నె: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా వివిధ అవార్డులను అందుకున్న క్రీడాకారులను క్రీడల శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ఆదివారం అభినందించారు. వారిని సత్కరించారు. పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమది మురుగేశన్‌కు కల్పనా చావ్లా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. కాంచీపురంకు చెందిన తులసిమదిని 2025 సంవత్సరానికి గాను కల్పనా చావాల్లా అవార్డుతో సత్కరించారు. అలాగే, తిరునెల్వేలి జిల్లాకు చెందిన సి. చందూరుకుమార్, సేలం జిల్లా ఎం. జయకుమార్, పారా హై జంప్ క్రీడాకారుడు టి. మరియప్పన్,చైన్నెకు చెందిన క్యారమ్స్ క్రీడాకారిణి కాశీమా, పుదుకోట్టైకు చెందిన ఎ. లావణ్య, కృష్ణగిరికి చెందిన కె. గౌరిలు సీఎం యువజన అవార్డులను అందుకున్నారు. వీరందర్నీ ఉదయనిధి స్టాలిన్ పిలిపించి సత్కరించారు. అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డి పాల్గొన్నారు.