నోటి క్యాన్సర్ నివారణపై అవగాహన
సాక్షి, చైన్నె: ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం సందర్భంగా ఓరల్ క్యాన్సర్ నివారణ, రక్షణ చర్యలపై అవగాహనను విస్తృతం ఏస్తూ వీఎస్ ఆస్పత్రి చర్యలు తీసుకుంది. టూ మినిట్ యాక్షన్ ఫర్ ఓరల్ క్యాన్సర్ ప్రొటెక్షన్ నినాదంతో ప్రచార కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టింది. సీనియర్ మోస్ట్ ప్రాక్టీసింగ్ మెడికల్ ఆంకాలజిస్టు డాక్టర్ ఎస్ సుబ్రమణియన్, మెడికల్ ఆంకాలజీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.నిత్య ఈ ప్రచార కార్యక్రమాన్ని స్థానికంగా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ, నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు వివరించారు. ప్రజలలో అవగాహన, ముందస్తు గుర్తింపు అన్నది లేని కారణంగా నివారణ చర్యలలో ఆల స్యం అవుతోందన్నారు. క్రమం తప్పకుండా స్వీయ తనిఖీలతో ముందస్తుగా గుర్తించడం ద్వారా త్వరితగతిన ఫలితాలను నివారణ చర్యల ద్వారా సాధించవచ్చని పేర్కొన్నారు. అందుకే వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.


