విశాల్‌తో జత కుదిరినట్టేనా?
తమిళసినిమా: నటుడు విశాల్‌కు మార్క్ ఆంటోని తరువాత సరైన సక్సెస్ లేదు. అలాంటిది కరెక్ట్‌గా గత 12 ఏళ్ల క్రితం ఈయన సుందర్.సీ దర్శకత్వంలో నటించిన మదగజరాజా చిత్రం ఈ పొంగల్‌కు తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించి విశాల్‌తో పాటు ఈ చిత్ర యూనిట్‌ను ఫుల్‌జోష్‌లో నింపింది. కాగా తాజాగా విశాల్ వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యారు. అలా పలు కథలను విన్నా, అవేవీ సెట్ కాలేదు. దీంతో తన సొంత నిర్మాణంలోనే చిత్రం చేయడానికి రెడీ అయినట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి రవి అరసు కథా దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కాగా ఇందులో విశాల్‌కు జంటగా నటి దుషారా విజయన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా వార్త. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి దుషారా విజయన్. ఈ అమ్మడు ఆ మధ్య నటుడు ధనుష్‌కు చెల్లెలిగా రాయన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా విక్రమ్‌తో జత కట్టిన వీర ధీర సూరన్ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. తదుపరి విశాల్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. దర్శకుడు రవి అరసు ఇటీవల ఈమెకు కథ చెప్పారని, ఆ కథ నచ్చడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విశాల్ స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం.
నటి దుషారా విజయన్
విశాల్‌తో జత కుదిరినట్టేనా?


